రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతార సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.ఈ సినిమాకు బుకింగ్స్ ఊహించని స్థాయిలో ఉండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.కేజీఎఫ్2 రేంజ్ లో కాకపోయినా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే కాంతార మూవీ వల్ల నష్టపోయే మూవీ ఏదనే గాడ్ ఫాదర్ మూవీ పేరు సమాధానంగా వినిపిస్తోంది.
గాడ్ ఫాదర్ మూవీకి ఇప్పటివరకు 54 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.కనీసం 90 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఈ సినిమాను హిట్ గా పరిగణించవచ్చు.
అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం 60 కోట్ల రూపాయల కలెక్షన్లను పరిమితం అయ్యే అవకాశం ఉంది.ఈ సినిమాకు ఏకంగా 30 కోట్ల రూపాయల మేర నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది.
అయితే నష్టం ఎంత వచ్చినా ఆ నష్టం నిర్మాతలకే పరిమితం అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. గాడ్ ఫాదర్ నష్టాల గురించి చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
చిరంజీవి సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోకపోవడంతో అభిమానులు తెగ ఫీలవుతున్నారు.చిరంజీవి త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.
స్టార్ స్టేటస్ అందుకున్న డైరెక్టర్ల డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు చిరంజీవి ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు.చిరంజీవి ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు 40 నుంచి 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
సినిమాసినిమాకు చిరంజీవి రేంజ్ పెరుగుతోంది.