దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీ ముగిసింది.
ఇప్పటివరకు అభిషేక్ రావును అధికారులు ఐదు రోజుల పాటు ప్రశ్నించారు.కాగా అభిషేక్ కు కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
అయితే ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ అధికారులు ముగ్గురును అదుపులోకి తీసుకున్నారు.కస్టడీలో భాగంగా అభిషేక్ రావు నుంచి అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం.