రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట.. ఈ సినిమాల విషయంలో ప్రేక్షకుడి ఆవేదన ఇదే?

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమాలపై ఆసక్తి చూపే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి అంతాఇంతా కాదు.

 This Is The Major Problem For Radheshyam Sarkaru Vari Paata And Acharya Movies D-TeluguStop.com

కొన్ని నెలల క్రితం వరకు పెద్ద సినిమాలకు రిలీజ్ రోజున టికెట్ దొరకడం కష్టమయ్యేది.అయితే రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలకు తొలిరోజు సులభంగానే టికెట్లు దొరికాయి.

టికెట్ రేట్లు పెంచడమే ఈ పెద్ద సినిమాల పాలిట శాపమైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 ప్రేక్షకుల అంచనాలను మించి ఉన్నాయి కాబట్టి ఈ సినిమాలకు టికెట్ రేట్లను పెంచినా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించిందనే సంగతి తెలిసిందే.

అయితే పెద్ద సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోని పక్షంలో ఎక్కువ మొత్తం ఖర్చు చేయడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు.

రాధేశ్యామ్ సినిమా కొత్త కథాంశంతో తెరకెక్కినా ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో లేవు.

Telugu Acharya, Chiranjeevi, Koratala Siva, Parasuram, Flop, Budget, Mahesh Babu

ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు రొటీన్ కథలతో తెరకెక్కడం ఈ సినిమాల పాలిట మైనస్ అయింది.కొరటాల శివ, పరశురామ్ లాంటి డైరెక్టర్లు కథల విషయంలో ఇలాంటి పొరపాట్లు ఎందుకు చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Acharya, Chiranjeevi, Koratala Siva, Parasuram, Flop, Budget, Mahesh Babu

తమ ఆవేదనను మేకర్స్ అర్థం చేసుకోవాలని ప్రేక్షకులు చెబుతున్నారు.పెరిగిన టికెట్ రేట్లు వీరాభిమానులు సైతం సినిమాకు దూరమయ్యే విధంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పెద్ద సినిమాలు థియేటర్లలో ఒక్కరోజు మాత్రమే ప్రదర్శితమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు.స్టార్ హీరోలు సైతం పరిమిత బడ్జెట్ లోనే సినిమాలను తెరకెక్కిస్తే బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.

భారీ బడ్జెట్ల వల్ల పెద్ద సినిమాలకు నష్టమే తప్ప లాభం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube