ఇక్కడ బంగారం ఎవరికి అక్కర్లేదు.పేదవాడి నుండి ధనికుడి వరకు అందరికీ ఇది అవసరం.
అందుకే ఉన్నంతలో ప్రతి ఒక్కరు దానిని కొనుగోలు చేస్తూ వుంటారు.మరీ ముఖ్యంగా మన ఆడవాళ్ళైతే ఈ పేరు వింటేనే పులకించిపోతుంటారు.
పడగలు పబ్బాలు అప్పుడు ఒంటినిండా నగలు వేసుకొని మురిసిపోతూ వుంటారు.అందుకే బంగారం వాడకంలో మనదేశం మిగతా దేశాలకంటే ఒక్క స్టెప్ ముందే ఉంటుంది.

ఇకపోతే టన్నుల టన్నులు బంగారం మనదేశంలోని ఆలయాలలో కొలువుదీరి ఉందంటే నమ్మశక్యం కాదు.భారతదేశం( India ) అంటేనే దేవాలయాలకు నిలయం.ఈ క్రమంలోనే దేశంలోని చాలా దేవాలయాలు ధనిక దేవాలయాలుగా గుర్తించబడ్డాయి.ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఆయా దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుసా? భారతదేశంలో ఉన్న దేవాలయాలలో మొత్తం 2000 నుండి 4000 టన్నుల వరకు బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆర్ధిక నిపుణులు.

ఇక్కడ ముందుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి( Shri Ananta Padmanabha Swamy ) ఆలయం గురించి మాట్లాడుకోవాలి.కేరళ రాష్ట్రంలోని అనంత పద్మనాభ స్వామి అందరికంటే సంపన్న దేవుడు.గుడి నేలమాళిగల్లో 6 రహస్య గదులను ఏర్పాటు చేసి మరీ వజ్రాలు, బంగారు అభరణాలు, బంగారు విగ్రహాలను ఉంచారని మీకు తెలుసా? మొత్తంగా చూసుకుంటే 13 టన్నుల బంగారం ఇక్కడ ఉందని అంచనా.ఆ తరువాత ఏపీలోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మాట్లాడుకోవాలి.శ్రీవారికి 10.3 టన్నుల బంగారం ఉందని తెలుస్తోంది.అలాగే జమ్మూ కాశ్మీర్( Jammu and Kashmir ) లోని వైష్ణో దేవి ఆలయంలో 1.2 టన్నుల బంగారం ఉందని, మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయంలో 376 కేజీల బంగారం ఉందని, మహారాష్ట్రలోని సిద్ధి వినాయక ఆలయంలో 120 కేజీల బంగారం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.







