పరిణామాలు చూస్తుంటే అవునని తెలుస్తుంది.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ( Tspsc paper leak )వ్యవహారంలో అధికార బారసా ను ఉక్కిరిబిక్కిరి చేసిన బిజెపి నేతలు ఇప్పుడు ఎస్ఎస్సి హిందీ పేపర్ లీకేజీ విషయంలో బండి సంజయ్ అరెస్టుతో అయోమయంలో పడ్డారు.
పక్కా గా ప్లాన్ చేసుకుని మరీ బండి( Bandi Sanjay ) ని బుక్ చేసిన అదికార పక్షం బిజేపి కావాలనే లీకేజీ ల విషయం లో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడం లో సక్సెస్అయ్యింది ….ఇప్పడిక ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజల్లో అంతగా వ్యతిరేకత ఉండదని అవి రాజకీయ వ్యాఖ్యలు గానే చూస్తారని అధికార పక్షంధీమా గా ఉంది….
అంతేకాకుండా తన వాట్సాప్ కు వచ్చిన పేపర్ ను తాను చాలా మందికి పంపించానని స్వయంగా సంజయ్ ఒప్పుకోవడంతో అది నైతికంగా భాజపాకు కొంత వ్యతిరేకంగా మారింది .

తన ప్రమేయం లేకపోయినప్పటికీ తనకు వచ్చిన పేపర్ ను అలా షేర్ చేయడం తప్పనే విషయం ఆయనకు తెలియదా అంటూ విమర్శలు వస్తున్నాయి….ఒక వేల లీకేజీ విషయంలో తనకు ముందు సమాచారం ఉంటే విద్యార్దుల బావిష్యత్తు ని దృష్టిలో పెట్టుకొని పోలీసులకు చెప్పాల్సింది పోయి దాని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించడం ఏమిటంటూ ప్రశ్నలు వినిపిస్తునాయి .

లీకేజీ ల విషయం లో ఇప్పటి వరకూ ముప్పేటదాటితో ఉక్కిరిబిక్కిరి అయిన కేసీఆర్( cm kcr ) ఇప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బంతిని అవతల కోర్టు లోకి పంపి ఆయన రిలాక్స్ అవుతున్నట్లుగా అర్థం అవుతుంది….చట్టం తన పని తను చేసుకో పోతుంది అంటూ జరుగుతున్న పరిణామాలను ఆయన నిశితంగా గమనిస్తున్నారు… దూకుడు అయిన రాజకీయాలతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూసిన బండి సంజయ్ వర్గానికి అది ఇప్పుడు భూమరాంగ్ గా మారడం తో తల పట్టుకుంటుంది…ఏది ఏమైనా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడంలో మాస్టర్ మైండ్ అయిన కేసీఆర్ ఇప్పుడు విషయాన్ని డైవర్ట్ చేసి బిజెపి వైపు మళ్ళించడంలో సక్సెస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.







