టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ తన సినిమాలకు దర్శకత్వం వహించే డైరెక్టర్లకు ఎంతో స్వేచ్ఛ ఇస్తారని ఇండస్ట్రీలో పేరుంది.ఇప్పటివరకు యాడ్స్ కు దూరంగా ఉన్న బాలకృష్ణ సాయిప్రియ కన్ స్ట్రక్షన్స్ కోసం యాడ్ లో నటించగా ఈ యాడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సాధారణంగా యాడ్స్ విషయంలో టాలీవుడ్ హీరోలు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు.తమకు నచ్చిన వ్యక్తులే యాడ్ కు డైరెక్టర్ గా పని చేయాలని భావిస్తారు.
యాడ్ కోసం స్టార్ డైరెక్టర్లు పని చేస్తే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే.బాలయ్య మాత్రం ఇతర హీరోలకు భిన్నంగా కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో యాడ్ లో నటించారు.
ఈ యాడ్ కోసం సదరు డైరెక్టర్ కు మొదట 2 లక్షల రూపాయల రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం అందుతోంది.అయితే యాడ్ అద్భుతంగా రావడంతో దర్శకుడి ప్రతిభకు బహుమానంగా 20 లక్షల రూపాయల కారు దక్కింది.

కొత్త దర్శకులను కూడా ప్రోత్సహించే విషయంలో బాలకృష్ణ నిజంగా గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో కమర్షియల్ యాడ్ లో నటించి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం బాలయ్యకు మాత్రమే సాధ్యమైందని ఇతర హీరోలకు బాలయ్యకు తేడా ఇదేనని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.మరోవైపు బాలయ్య మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.నవంబర్ నెల చివరి వారం నాటికి వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది.శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
స్టార్ హీరో బాలయ్య రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.