మళయాళ భామ నిత్యా మీనన్ ప్రెగ్నన్సీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది.నిత్యా మీనన్ ప్రెగ్నన్సీ టెస్ట్ కిట్ ని షేర్ చేస్తూ వండర్ బిగిన్స్ అంటూ ఒక కామెంట్ పెట్టింది.
అసలు ఇంతకీ నిత్యా మీనన్ ఏం చెప్పదలచుకుంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కొంపదీసి నిత్యా మీనన్ ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ చేసిందా అసలు పెళ్లి కానీ ఆమె గర్భవతి ఎలా అవుతుంది అని డౌట్ వస్తుంది.
ఇలాంటి హింట్లు ఇచ్చేప్పుడు ఆడియన్స్ బుర్రలు బద్ధలు కొట్టుకుంటారన్న ఆలోచన వారికి రాదా ఏంటి.

ఇంతకీ అసలు నిత్యా మీనన్ ఎందుకు ఆ ఫోటో షేర్ చేసి ఉండొచ్చు అంటే.ఆమె నెక్స్ట్ చేసే సినిమా ప్రమోషన్ అయ్యుండొచ్చు అని కొందరు చెబుతున్నారు.ఏది ఏమైనా నిత్యా మీనన్ షేర్ చేసిన ఫోటో మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంతకీ విషయం ఏంటన్నది నిత్యా మీనన్ మాత్రమే చెప్పాల్సి ఉంటుంది.ఈమధ్యనే తిరు సినిమాతో నిత్యా మీనన్ హిట్ అందుకుంది.తెలుగులో వచ్చిన అవకాశాలను కాదంటున్న నిత్యా తమిళంలో మాత్రం వరుసా సినిమాలు చేస్తూ అలరిస్తుంది.







