ప్రస్తుతం తెలుగులో ఉన్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ( Sandeep Vanga ) పాన్ ఇండియా డైరెక్టర్ గా ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పుడు సందీప్ కి తమిళ్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ కి మధ్య పోటీ ఉంది అని చాలామంది సినీ అభిమానులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక వీళ్ల సినిమాలను బట్టి వీళ్ల సక్సెస్ లను బట్టి డైరెక్టర్లను నిర్ణయిస్తున్నారు.నిజానికి వీళ్లిద్దరి మధ్య పోటీ ఉంది అని జనాలు అంటున్నప్పటికీ ఇద్దరు తీసే సినిమాల స్టైల్ లో వేరియేషన్స్ అయితే ఉన్నాయి.

ఒక కథని నేచురల్ గా ఎలాగైతే చెప్పవచ్చు అనే దాని మీద దృష్టి పెట్టి ఆయన సినిమాలు చేస్తూ ఉంటాడు.కానీ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) ఒక భారీ స్కేల్ లో సినిమాలు చేసి సక్సెస్ లు కొట్టడం ఆయన స్టైల్… ఇక ఇద్దరికీ వేరియేషన్స్ ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య పోటీ అనేది నడుస్తుంది అని అందరూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.నిజానికి సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా రేంజ్ లో ఒక అద్భుతమైన డైరెక్టర్ ఆయన ఢీ కొట్టేవారు ఇండియాలో లేరు అనే చెప్పాలి.అయితే లోకేష్ కనకరాజ్ కూడా విక్రమ్ సినిమా( Vikram movie )తో తనదైన రేంజ్ లో సక్సెస్ చాటుకున్నాడు కానీ రీసెంట్ గా వచ్చిన లియో సినిమాతో మాత్రం కొంతవరకు చతికిల పడ్డాడు కానీ సందీప్ రెడ్డి వంగ అలా కాదు ఆయన తీసిన మూడు సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్నాడు.

ఒకదానికి మించి మరొక సినిమా సక్సెస్ అవడంతో ఆయన పేరు ఇండియాలో మారుమ్రోగిపోతుంది.ఇక ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు సైతం ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు…పాన్ ఇండియా రేంజ్ లో సందీప్ ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.







