తెలుగు సినీ ప్రేక్షకులకు కలెక్షన్ సింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి( Manchu Lakshmi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మోహన్ బాబు కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అనగనగా ఒక ధీరుడు, గుండెల్లో గోదారి, చందమామ కథలు లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే అంతకముందే పలు అమెరికన్ టీవీ సీరీస్ లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి యాంకర్ గా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది మంచు లక్ష్మి. మలయాళం లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే మంచులక్ష్మి సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదోక విషయంలో వార్తలో నిలుస్తూ ఉంటుంది మంచు లక్ష్మి.ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచూ ఏదోక ఒక విషయంతో ట్రోలింగ్స్ కి కూడా గురవుతూ ఉంటుంది.
అలాగే మంచు ఫ్యామిలీలో( Manchu Family ) ఎక్కువగా ట్రోలింగ్స్ ని ఎదుర్కొనే వారిలో మంచు లక్ష్మి కూడా ఒకరు అని చెప్పవచ్చు.తనపై ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా మంచు లక్ష్మి అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది.
తనకు తన ఫ్యామిలీకి తన కూతురికి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసింది.ఆ వీడియోలో మంచు లక్ష్మి స్విమ్ సూట్( Swim Suit ) ధరించి గడ్డ కట్టించి చలిలో కూడా చల్లనీటితో స్నానం చేస్తూ కనిపించింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
కొందరు పాజిటివ్గా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు క్రేజీగా నెగటివ్ గా కామెంట్ చేస్తున్నారు.
ఇకపోతే మంచు లక్ష్మి సినిమాల విషయానికి వస్తే.గత ఏడాది మోహన్ లాల్( Mohan Lal ) నటించిన మాన్ స్టర్ సినిమాతో( Monster Movie ) ప్రేక్షకులను పలకరించిన మంచు లక్ష్మి ఈ సినిమాతో సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది.కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.
అయితే ప్రస్తుతం అగ్ని పర్వతం అనే లేడీ ఒరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది.ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.