సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒక హీరో హీరోయిన్ ను అనుకొని మరొక సెలబ్రిటీలతో సినిమా చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి.ఇలా కొన్నిసార్లు అనుకున్నటువంటి కొన్ని కాంబినేషన్లు కుదరకపోవడంతో అభిమానులు కూడా ఎంతో డిసప్పాయింట్ అవుతుంటారు.
ఇలా ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ కాంబినేషన్ సినిమాలు మిస్ కావడంతో అభిమానులు చాల డిసప్పాయింట్ అయినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయని చెప్పాలి.ఇలా మిస్ అయినటువంటి కాంబినేషన్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన కాంబినేషన్ కూడా ఒకటి అని చెప్పాలి.

రష్మిక మందన్న(Rashmika Mandanna) ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమాని మేకర్స్ ప్లాన్ చేశారట.అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయారు కట్ చేస్తే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ సినిమాగా నిలిచింది.మరి ఎన్టీఆర్ రష్మిక మందన్న కాంబినేషన్ లో మిస్ అయినటువంటి ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే ఎన్టీఆర్ హీరోగా మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం అరవింద సమేత (Aravinda Sametha) .ఈ సినిమా కోసం ముందుగా హీరోయిన్ పాత్రలో రష్మికను అనుకున్నారట.

రష్మిక అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి రావడంతో ఈమె అయితే అన్ని విధాలుగా ఈ సినిమాకి బాగుంటుందని త్రివిక్రమ్ భావించి ఈ సినిమా అవకాశాన్ని తనకు కల్పించారని తెలుస్తోంది.ఈ విధంగా ఈ సినిమా అవకాశం రష్మికకు రావడంతో రష్మిక అప్పటికే పలు సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.అదే విధంగా తన కాల్ షీట్స్ ఏ మాత్రం ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమా అవకాశాన్ని వదులుకున్నారని తెలుస్తుంది.కొంత సమయం పాటు ఎదురు చూస్తే తప్పకుండా తన కాల్ షీట్స్ దొరుకుతాయని తాను అడ్జస్ట్ చేస్తానని రష్మిక చెప్పినప్పటికీ ఈ కాంబినేషన్ లో సినిమా కుదరలేదని తెలుస్తుంది.
అప్పటికే ఎన్టీఆర్ సినిమాలు చాలా ఆలస్యం కావడంతో త్రివిక్రమ్ తప్పనిసరి పరిస్థితులలో ఈ సినిమాలో నటి పూజా హెగ్డే (Pooja Hedge)కు అవకాశం ఇచ్చారు.దాంతో రష్మిక ఎన్టీఆర్ కాంబినేషన్లో రావాల్సిన ఈ సినిమా మిస్ అయిందని తెలుస్తుంది.