హెయిర్ ఫాల్ తో ఇక నో వర్రీ.. ఈజీగా వదిలించుకోండిలా!

సాధారణంగా కొందరిలో హెయిర్ ఫాల్( Hairfall ) అనేది చాలా అధికంగా ఉంటుంది.

ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కాలుష్య కారకాలకు గురి కావడం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల హెయిర్ లాస్ ఎక్కువగా జరుగుతుంటుంది.

దాంతో హైరానా పడిపోతుంటారు.ఎలా ఈ సమస్యను అడ్డుకోవాలో తెలియక మదన పడుతుంటారు.

అయితే హెయిర్ ఫాల్ తో ఇక నో వర్రీ.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని ప్రయత్నిస్తే చాలా ఈజీగా జుట్టు రాలే సమస్యను వదిలించుకోవచ్చు.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) వేసి అర కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి.అలాగే అర కప్పు ఉల్లిపాయ ముక్కలు,( Onions ) అర కప్పు కరివేపాకు( Curry Leaves ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసి బాగా మిక్స్ చేస్తే న్యాచురల్ హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.

ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

ఉల్లి, కరివేపాకు, బియ్యం, కొబ్బరి నూనె ఇవన్నీ జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తాయి.జుట్టు రాలడాన్ని అరికడతాయి.హెయిర్ ఫాల్ ను దూరం చేయడంలో ఇప్పుడు చెప్పుకున్న న్యాచురల్ టానిక్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

పైగా ఈ టానిక్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.మరియు హెయిర్ డ్యామేజ్ కు సైతం చెక్ పెడుతుంది.

ఈ స్క్ర‌బ్‌ను వారంలో ఒక్క‌సారి వాడితే మీ ముఖం మెరిసిపోవ‌డం ఖాయం!
Advertisement

తాజా వార్తలు