కొత్త ఎమ్మెల్సీ ల నేపథ్యం ఇదే

నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ కలిగించాయి.ఆ తరువాత ఎన్నికల ఫలితాలు వెలుపడ్డాయి .

 This Is The Background Of The New Mlcs, Ysrcp, Tdp,  Mlcelections, Jagan, Cbn, C-TeluguStop.com

ఈ ఫలితాల్లో ఏపీ అధికార పార్టీ వైసీపీ ఆరు స్థానాలను , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఒక్క స్థానాన్ని దక్కించుకున్నాయి.మొత్తం పోటీలో ఎనిమిది మంది అభ్యర్థులు ఉండగా,  వైసీపీ నుంచి పోటీ చేసిన కోలా గురువులు పోటీచేసి ఓటమి చెందారు.

టిడిపి( TDP ) నుంచి పోటీ చేసిన ఒక్క అభ్యర్థి పంచుమర్తి అను రాధ విజయం సాధించారు.ఈ విజయం పై టిడిపి సంబరాలు చేసుకుంటుంది.ఇటీవల జరిగిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు టిడిపి ఖాతాలో పడగా,  ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోను తమకున్న బలం మేరకు ఒక్క స్థానంలోనూ టిడిపి విజయం సాధించింది.ఇదిలా ఉంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల నేపథ్యం ఒకసారి పరిశీలిస్తే.

టిడిపి నుంచి పోటీ చేసి గెలిచిన పంచుమర్తి అనురాధ 2000 నుంచి 2005 వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ గా పనిచేశారు.

Telugu Chandrababu, Jagan, Kola Guruvulu, Mlc Ijrayil, Penmeta Suresh, Pothula S

పద్మశాలి కుటుంబంలో జన్మించిన అనురాధ( Anuradha ) కు మొదట్లో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు.ఆమె సాధారణ గృహిణి గానే ఉన్నారు .ఆ సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు ఆమెకు కార్పొరేటర్ గా అవకాశం కల్పించారు.ఆ తర్వాత మేయర్ గా ఎంపిక చేశారు.మేయర్ అయిన తర్వాతే ఆమె రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడంతో పాటు,  టిడిపి తరఫున బలంగా గొంతు వినిపిస్తూ వస్తున్నారు.2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆమె టిడిపిలోని ఉంటూ కష్ట కాలంలో పార్టీ తరఫున గొంతు వినిపిస్తూ వస్తున్నారు.  మీడియా,  సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్ గా ఉంటూ అనేక డిబేట్ లలో పాల్గొంటూ ఉంటారు.

వైసిపి కొత్త ఎమ్మెల్సీలు గురించి తెలుసుకుంటే…  ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో కోలా గురువులు ఓటమి చెందారు.ఈయన విశాఖ దక్షిణ నియోజకవర్గంకు చెందిన వ్యక్తి.మత్స్యకారు వర్గానికి చెందిన కోలా గురువులు నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందారు.ఈయన విషయాన్ని పక్కన పెడితే గెలిచిన ఆరుగురు ఎమ్మెల్సీలలో మర్రి రాజశేఖర్( Marri Rajasekhar ) చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే.

Telugu Chandrababu, Jagan, Kola Guruvulu, Mlc Ijrayil, Penmeta Suresh, Pothula S

కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.2019 ఎన్నికల్లో తన సీటును ప్రస్తుత మంత్రి విడదల రజనికి త్యాగం చేశారు.అప్పట్లోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు.ఈ మేరకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పించడంతో , నిన్న జరిగిన ఎన్నికల్లో రాజశేఖర్ విజయం సాధించారు.

ఇక జయ మంగళ వెంకటరమణ విషయానికొస్తే ఆయన నెల క్రితమే వైసీపీ ( YCP )లో  చేరారు.కృష్ణాజిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే గా టిడిపి నుంచి గతంలో ఎన్నికయ్యారు.

ఇక మరో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసి ఓటమి చెందారు.తాజాగా ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం  ఇచ్చారు .ఇక పోతుల సునీత , పెనుమత్స సురేష్( Penumatsa Suresh ) ఇద్దరు గతం నుంచి ఎమ్మెల్సీలు.మరోసారి ఆ ఇద్దరికి జగన్ అవకాశం కల్పించారు .  ఇక మరో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ కోనసీమకు చెందిన వ్యక్తి షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి .సామాజిక వర్గాల లెక్కల్లో భాగంగా జగన్ అవకాశం కల్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube