అంతరిక్ష నౌక ఇంటర్‌స్టెల్లార్ వాయేజర్-2 సాధించిన ఘనత ఇదే!

సరిగ్గా 46 ఏళ్ల క్రితం అంటే 1977లో భూమి నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన అంతరిక్ష నౌక వాయేజర్-2.( Voyager 2 ) ఇది నాటినుండి నేటివరకు విశ్వ రహస్యాలను నిరాటంకంగా భూమికి పంపిస్తూనే ఉంది.

 This Is The Achievement Of The Spacecraft Interstellar Voyager-2 Details, Inters-TeluguStop.com

మన సౌర వ్యవస్థను( Solar System ) దాటేసి సూర్యుడి ప్రభావం అస్సలు లేని ఇంటర్ స్టెల్లార్ స్పేస్ లో( Interstellar Space ) ఇది ప్రయాణిస్తోంది అంటే మీరు నమ్ముతారా? 1977లో విశ్వ రహస్యాలను తెలుసుకునేందుకు వాయేజర్ 1, వాయేజర్-2 అంతరిక్ష నౌకల్ని నాసా ( NASA ) ప్రయోగించిన సంగతి మీరు చదివే వుంటారు.

ఇది ఈ క్రమంలో భూమికి అత్యంత దూరంగా ఉన్న గురుడు, యూరేనస్, శని, నెప్ట్యూన్ వంటి గ్రహాల ఛాయాచిత్రాలను భూమికి పంపింది.తాజాగా వాయేజర్ 2 మిషన్ 2026 వరకు పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ఇంజనీర్లు తేల్చి చెప్పారు.ప్రస్తుతం గంటకు 55,345 కిలోమీటర్లు అంటే సుమారుగా సెకన్ కు 16 కిలోమీటర్ల వేగంతో ఇది విశ్వంలో దూసుకెళ్తోందని భోగట్టా.

ప్రస్తుతం భూమి నుంచి 2000 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయేజర్-2కు భూమి నుంచి సిగ్నల్స్ అందుకోవాలంటే దాదాపుగా 18 గంటల సమయం పడుతోందట.దానిలో ఉన్న కొన్ని సైన్స్ పరికరాలు మరికొన్ని ఏళ్ల పాటు ఆన్ లోనే ఉండనున్నాయి.

సూర్యుడి అవతల ఉన్న విశ్వం సమాచారం చాలా విలువైంది కావడంతో వీలైనన్ని ఎక్కువ సైన్స్ పరికాలు అక్కడికి పంపేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.వాయేజర్-2 రేడియో ఐసోటోప్ థర్మోఎలెక్ట్రిక్ జనరేటర్ (RTGs)ను ఉపయోగిస్తుంది.ఇది ఫ్లూటోనియం నుంచి వేడిని విద్యుత్ గా మారుస్తోంది.ప్రస్తుతం అంతరిక్ష నౌక ఇంటర్‌స్టెల్లార్ స్పేస్ నుంచి కీలక డేటాను అందించడం కొనసాగిస్తున్నందున శక్తి నెమ్మదిగా తగ్గుతోంది.

నాసాలోని బృందం పవర్‌ను ఆదా చేసేందుకు ఇప్పటికే హీటర్లు మరియు ఇతర సిస్టమ్‌లను ఆఫ్ చేసింది.మిగిలి ఉన్న ఎనర్జీతో మరింత సమచారం పొందాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube