ఇదొక హఠాత్పరిణామం... తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదట?

వినడానికి చాలా చోద్యంగా ఉందంటారా? అవును, ఉద్యోగ ఇంటర్వ్యూకి హాజరైన ఓ యువతికి విచిత్ర అనుభవమీ ఎదురైంది మరి.సదరు ఉద్యోగానికి కావలసిన అన్ని క్వాలిఫికేషన్స్‌ ఆమెకి ఉన్నప్పటికీ తన చర్మ రంగు కారణంగా ఉద్యోగానికి అనర్హురాలిగా కంపెనీ రిజెక్ట్‌ చేసిందని వాపోయింది పాపం.

 This Is A Sudden Result That He Was Not Given A Job Because He Was White , Vira-TeluguStop.com

బేసిగ్గా సరైన క్వాలిఫికేషన్స్‌ లేవనో.స్కిల్స్ లేవనో ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టపడరు.

కానీ ఇక్కడ కధ వేరే లెవల్ వుంది.ఇలా కూడా రిజక్ట్ చేస్తారా బాబు అంటూ ఆమె సోషల్ మీడియాలో తన గోడువెల్లగక్కింది.

వివరాల్లోకి వెళితే, బెంగళూరులోని( Bangalore ) ఓ కంపెనీ ఉద్యోగ ప్రకటన చూసి ‘ప్రతీక్ష జిక్కర్‌’( Pratiksha Jicker ) అనే యువతి ఇంటర్వ్యూకి వెళ్ళింది.అక్కడ కంపెనీవారు చేసిన 3 రౌండ్ల ఇంటర్వ్యూలోనూ ఆమె విజయవంతంగా నెగ్గింది.ఐతే జాబ్‌కి సెలెక్ట్‌ కాలేదు.అపాయింట్మెంట్ వస్తుందేమోని ఎదురు చూసిన ఆమెకు కొన్ని రోజుల తరువాత షాకిచ్చే మెయిల్‌ పంపించింది.దాన్ని చూసిన ప్రతీక్షకి దిమ్మతిరిగిపోయింది.దాంతో ఆమె తనగోడుని సోషల్ మీడియాలో వెళ్లగక్కింది.

ఇంతకీ అందులో ఏముందంటే.ఉద్యోగం పొందడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలు, అర్హతలు మీకు ఖచ్చితంగా ఉన్నాయి.

మీరు ఈ ఉద్యోగానికి సరిపోతారు.కానీ క్షమించండి… మీ శరీర రంగు (స్కిన్ టోన్) మా టీంతో మ్యాచ్‌ కాలేదు.

మీ చర్మం రంగు తెల్లగా ఉండటం వల్ల టీంలో విభేదాలు తలెత్తుతాయని యాజమన్యం భావించింది.అందుకే మీకు ఈ ఉద్యోగం ఇవ్వలేము… దయచేసి అర్ధం చేసుకోండి.

అంటూ మెయిల్‌లో పేర్కొన్నారు.

దీంతో ఖంగు తిన్న సందరు యువతి కంపెనీ నుంచి తనకు వచ్చిన మెయిల్‌ స్క్రీన్‌ షాట్‌ను( Mail screenshot ) సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ తన అనుభవాన్ని రాసుకొచ్చింది.ఇలాక్కూడా రిజక్ట్ చేస్తారా? ఇలాంటి చేదు అనుభవం ఎవరికైనా జరిగిందా? అంటూ ప్రశ్నించింది.మనిషి రంగును బట్టి కాకుండా ట్యాలెంట్‌ను బట్టి ఉద్యోగం ఇవ్వాలని కూడా తన పోస్టులో కోరింది.

దాంతో ప్రతీక్ష షేర్‌ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ పోస్టుని మరికొందరు షేవ్ చేసుకొని తమతమ సోషల్ మీడియా మాధ్యమాలద్వారా షేర్ చేస్తున్నారు.జనాలు అయితే ఆ పోస్టుని చూసి అవాక్కవుతున్న పరిస్థితి.‘ఇది వేరే లెవల్ రిజక్షన్ లెటర్’ అని కొందరు కామెంట్ చేస్తే….మరికొంతమంది మాత్రం ‘అదొక ఫేక్ లెటర్’ అని కొట్టి పారేస్తున్నారు.మరి మీకేమనిపిస్తుందో చెప్పండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube