నాలాంటి వాడి చేత కంటతడి పెట్టించిన చిత్రం ఇది.. కృష్ణ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ కృష్ణవంశీ( Krishnavamsi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

 This Is A Movie That Was Brought To Tears By Someone Like Me Krishna Vamsi Inter-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి కృష్ణవంశీ తాజాగా రంగమార్తాండ( Rangamarthanda ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ వంటి వారు ఎంతో అద్భుతంగా నటించారు.

ఇలా ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మార్చి 22వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం( Brahmanandam ) పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి.దాదాపు 1200 సినిమాలలో కమెడియన్ గా నటించిన బ్రహ్మానందం ఈ సినిమాలో సరికొత్తకోణంలో నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా చేశారు.అయితే తాజాగా ఈ సినిమా గురించి కృష్ణవంశీ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.

మరాఠీ చిత్రం నన్నా సినిమా చూసినటువంటి ప్రకాష్ రాజ్ ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో సహాయం చేయాలని కోరారు.

ఈ సినిమా చూసిన తర్వాత నాలాంటి రాక్షసుడు తోనే కంటతడి పెట్టించిన చిత్రం ఇది.ఇందులో నాకు తోచిన విధంగా మార్పులు చేసి ప్రకాష్ రాజ్ కు ఇవ్వగా ఈ సినిమాకు నన్ను దర్శకత్వం వహించమన్నారు.ఇక ఈ సినిమాకు తాను డైరెక్టర్గా మారిపోయానని తెలిపారు.

ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం గారి నటన అద్భుతం అని చెప్పాలి ఈయన ఇన్ని సినిమాలలో చేసినా కూడా ఒక్కో సీన్ కు 20 టేకులు చెప్పిన ఓపికగా చేసేవారని ఈ సందర్భంగా కృష్ణవంశీ వెల్లడించారు.ఇక ఇందులో ప్రతి ఒక్కరి నటన ఈ సినిమాకు మెగాస్టార్ గారి వాయిస్ ఓవర్ కూడా ప్లస్ అయిందని ఈ సందర్భంగా రంగమార్తాండ సినిమా గురించి కృష్ణవంశీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube