వడగళ్ల వాన చూసేందుకు భలే అందంగా ఉంటుంది.అయితే ఒక్కోసారి ఈ వడగళ్ల వాన భయంకరంగా కూడా మారుతుంది.
ఈ వర్షాన్ని చూస్తే గజగజ వణికి పోక తప్పదు.ఇక ఈ వర్షం పడే ప్రాంతంలో ఉంటే తీవ్ర గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది.
ఎందుకంటే మంచు రూపంలో పడే గడ్డలు చాలా వేగంగా నేలపై పడతాయి.అదే బయట మనుషులు ఉంటే వారిపై ఇవి పడటం వల్ల గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇలాంటి వడగళ్ళు పెద్ద సైజులో పడటం చాలా అరుదు.
అయితే తాజాగా ఆఫ్రికాలో గోల్ఫ్ బాల్స్ సైజ్ ఉన్న మంచు గడ్డలు వర్షంలా పడ్డాయి.ఈ వడగళ్ల వానకు సంబంధించిన వీడియోని పూబిటీ అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.“ఇలాంటి వడగళ్ళు 50 మిమీ కంటే ఎక్కువ వ్యాసం కలిగిన మంచు బంతులు.ఈ వడగళ్ల వానలు 15 నిమిషాల వరకు కరిగిపోకుండా ఉంటాయి.” అని పూబిటీ పేజీ ఒక క్యాప్షన్ జోడించింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలో వడగళ్ల వర్షం కురవడం చూడొచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
వామ్మో ఇది చాలా భయంకరంగా ఉంది అని ఒక యూజర్ కామెంట్ చేశారు.పాపం, జంతువుల పరిస్థితి ఏంటో అని ఒక యానిమల్ లవర్ కామెంట్ పెట్టారు.
జంతువులు మాత్రమే కాదు బయట ఉన్న ప్రజలకు కూడా ఇది ప్రమాదకరమైనని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ అతిపెద్ద వడగళ్ల వల్ల గొడుగు కి కూడా బొక్కలు పడతాయని ఒక యూజర్ కామెంట్ చేశారు.
ఈ నేచర్ వండర్ వీడియోని మీరు కూడా వీక్షించండి.