ఎండల దెబ్బ‌కు ఒంట్లో వేడి చేసిందా.. ఇలా చేశారంటే దెబ్బకు కూల్ అవుతారు!

ఎండలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

వేసవి కాలం( Summer Season )లో నిత్యం మన ఇంట్లో ఎవరో ఒకరి నోట వేడి చేసింది అన్న మాటను వింటూనే ఉంటాం.

మనం కూడా అప్పుడప్పుడు అంటూనే ఉంటాం.ఒంట్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల తీవ్రమైన తలనొప్పి, నోటిలో పుండ్లు పడటం, మలబద్ధకం, జ్వరం రావడం, చిరాకు, అధిక చెమటలు( Heavy Sweat ) ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.

ఈ క్రమంలోనే ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు పెరుగు, మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉంటారు.కానీ వాటితోనే కాలక్షేపం చేయలేము కదా.అందుకే మీకోసం ఇప్పుడు ఒక అద్భుతమైన జ్యూస్ గురించి చెప్పబోతున్నాము.ఒంట్లో వేడి( Body Overheat ) ఎక్కువైన వారు ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే దెబ్బకు కూల్ అవుతారు.

ఒంట్లో వేడి మొత్తం ఆవిరి అవుతుంది.మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు శుభ్రంగా పొట్టు తొలగించిన తాటి ముంజలు(ఐస్ ఆపిల్‌) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్( Sugar ) , ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు, రెండు ఐస్ క్యూబ్స్ మరియు పావు టేబుల్ స్పూన్‌ యాలకుల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన జ్యూస్ సిద్ధం అవుతుంది.ఈ ఐస్ ఆపిల్ జ్యూస్( Ice Apple Juice ) వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే గుణాలు ఈ ఐస్ ఆపిల్ జ్యూస్ లో మెండుగా ఉంటాయి.నిత్యం ఈ జ్యూస్ ను తీసుకుంటే శ‌రీరంలో అధిక వేడి మొత్తం తొల‌గిపోతుంది.

బాడీ కూల్ గా మారుతుంది.అలాగే డీహైడ్రేషన్( Dehydration ), హీట్ స్ట్రోక్ వంటి వాటి నుంచి మిమ్మ‌ల్ని రక్షించడానికి ఈ జ్యూస్ స‌హాయ‌ప‌డుతుంది.

వేస‌విలో నీర‌సం, అల‌స‌ట వంటివి అధికంగా వేధిస్తూ ఉంటాయి.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

అయితే ఈ ఐస్ ఆపిల్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే రోజంతా ఎన‌ర్జిటిక్ గా ఉంటారు.అంతేకాదు, తాటి ముంజలు లివ‌ర్( Liver Health ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.తాటి ముంజ‌ల‌తో పైన చెప్పిన విధంగా జ్యూస్ త‌యారు చేసుకుని తీసుకుంటే.

Advertisement

అందులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం శ‌రీరంలో విషప‌దార్థాల‌ను తొల‌గిస్తుంది.ర‌క్త‌పోటును కంట్రోల్ చేస్తుంది.

మ‌రియు ఐస్ ఆపిల్ జ్యూస్ శ‌రీర బ‌రువును సైతం అదుపులోకి తెస్తుంది.

తాజా వార్తలు