ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమానే.. గోపీచంద్ చేసి సూపర్ హిట్ కొట్టాడు మీకు తెలుసా?

ప్రభాస్ గోపీచంద్ ఇద్దరు హీరోలు ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.

ఇకపోతే తక్కువ సమయంలోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగగా.అటు గోపీచంద్ మాత్రం ఇప్పటికీ సరైన స్టార్ డమ్ సంపాదించడం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు.

అయితే ఇక ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎక్కడ కలుసుకున్న కూడా ఎంతో ప్రేమగా పలకరించుకుంటారు.అంతే కాదు ఒకరి సినిమా ఫంక్షన్లకు మరొకరు వస్తు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు.

అయితే సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాను మరో హీరో చేసి హిట్ కొట్టడం జరుగుతూ ఉంటుంది.అయితే ఇండస్ట్రీలో ప్రాణమిత్రులుగా కొనసాగుతున్న ప్రభాస్ గోపీచంద్ మధ్య కూడా ఇలాంటి సినిమా ఒకటి ఉందట.

Advertisement

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాను గోపీచంద్ చేసి సూపర్ హిట్ అందుకుని మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు.ఆ సినిమా ఏదో కాదు యజ్ఞం.

ఇటీవలే పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు హీరో గోపీచంద్. తొలివలపు సక్సెస్ కాకపోవడంతో ఆరేడు నెలల పాటు ఎలాంటి అవకాశాలు రాలేదు.

అలాంటి సమయంలో ఓ రోజు తేజ ఫోన్ చేసి ఓ సీన్ చెప్పి విలన్ గా చేస్తావా అని అడిగారు.వెంటనే చేస్తానని చెప్పాను ఇక ఆ తర్వాత విలన్ గా మంచి హిట్ లభించింది అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చాడు.

ఇక యజ్ఞం సినిమా ఆఫర్ కూడా అనుకోకుండా వచ్చిందని ముందుగా ఆ కథ నాకోసం రాసింది కాదు అంటూ గోపిచంద్ తెలిపాడు.ప్రభాస్ కోసం కథ రాసి ఇక ప్రభాస్ కు కథను చెప్పారు.ఇక ప్రభాస్ రిజెక్ట్ చేయడం తో కళ్యాణ్ రామ్ కి కూడా ఆ కథను వినిపించారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అయితే వారికి సినిమా కథ నచ్చిన అప్పటివరకూ రవికుమార్ మొదటి సినిమా పెద్దగా ఆడకపోవడంతో అతనితో సినిమా అనేసరికి వెనకడుగు వేశారు.ఇక అప్పుడు ఆ దర్శకుడితో ఎవరో అన్నారట వాళ్ళు వీళ్ళు ఎందుకు గోపితో సినిమా చేయొచ్చు కదా అని.అలా తనకు యజ్ఞం సినిమా అవకాశం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు