ఈ చైనా బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌చేస్తే 1000Km తిరిగి రావొచ్చట!

గత కొన్నాళ్లుగా ఆయిల్ ధరలు ఆకాశాన్నంటడంతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపుకి జనాలు మొగ్గు చూపుతున్నారు.ఈ క్రమంలో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.

 ఈ చైనా బ్యాటరీని ఒక్కసారి ఛార�-TeluguStop.com

ఈ క్రమంలో ఈ వాహనాల్లో రేంజ్ అనేది చాలా కీలకంగా మారింది.అందుకనే బ్యాటరీ తయారీ కంపెనీలు అత్యధిక రేంజ్ అందించే పవర్‌ఫుల్ బ్యాటరీలను తయారు చేసే పనిలో పడ్డాయి.

తాజాగా ఓ చైనీస్ ఆటోమోటివ్ లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ కంపెనీ CATL (కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ కో లిమిటెడ్ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ బ్యాటరీ)ని ఆవిష్కరించింది.ఎలక్ట్రిక్ వాహనాలకు అమర్చే ఈ బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 1,000 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

CTP (థర్డ్-జనరేషన్ సెల్-టు-ప్యాక్) టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ బ్యాటరీని క్విలిన్ లేదా CTP 3.0 బ్యాటరీ అని కంపెనీ పిలుస్తోంది.ఈ సరికొత్త బ్యాటరీ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ చెప్పిన ప్రకారం, క్విలిన్ బ్యాటరీకి 72 శాతం వాల్యూమ్ యుటిలైజేషన్ ఎఫిషియన్సీ ఉంది.అలానే ఈ బ్యాటరీ టెర్నరీ బ్యాటరీ సిస్టమ్‌ల కోసం 255 Wh/kg వరకు ఎనర్జీ డెన్సిటీని అందిస్తుంది.

CATL ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక ఇంటిగ్రేషన్ లెవెల్‌తో క్విలిన్ బ్యాటరీని రూపొందించడం జరిగింది.చైనీస్ పురాణాల్లో కనిపించే క్విలిన్ అనే ఒక జీవి పేరు మీద ఈ బ్యాటరీకి నామకరణం చేశారు.

CATL ప్రకారం, బ్యాటరీల మాస్ ప్రొడక్షన్ కొద్ది నెలలలో ప్రారంభం కానుంది.ఈ బ్యాటరీలు 2023లో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి.సీఏటీఎల్ కంపెనీ ఇప్పటికే తన బ్యాటరీలను టెస్లా, వోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ, నియో వంటి ఆటోమొబైల్ సంస్థలకు సరఫరా చేస్తోంది.సీటీపీ టెక్నాలజీ సిస్టమ్‌లో మాడ్యూల్స్ లేకుండా సెల్‌లను నేరుగా ప్యాక్‌లలోకి చేర్చడం జరుగుతుంది.

దీనివల్ల ఎనర్జీ డెన్సిటీ ఇంప్రూవ్ అవుతుంది.అలాగే బ్యాటరీల తయారీ మరింత ఈజీ అవ్వడంతో పాటు తయారీ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి.విశేషమేంటంటే, సీటీపీ 3.0 బ్యాటరీ సర్వీస్ లైఫ్, సేఫ్టీ, ఛార్జింగ్ స్పీడ్, లో-టెంపరేచర్ పర్ఫామెన్స్‌ లాంటి విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube