Werewolf syndrome Lalit Patidar : తోడేలు లాగా ఈ అబ్బాయి శరీరం నిండా వెంట్రుకలే.. అవాక్కవుతున్న నెటిజన్లు!

మధ్యప్రదేశ్‌లో ఒక యువకుడు విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు.లలిత్ పాటిదార్ అనే 17 ఏళ్ల యువకుడికి ఒళ్ళంతా వెంట్రుకలే మొలిచాయి.

 This Boy's Body Is Full Of Hair Like A Wolf , Werewolf Syndrome, Weird Diseases-TeluguStop.com

ముక్కు, ముఖం, చేతులు, కాళ్లు అనే తేడా లేకుండా శరీరం అంతా వెంట్రుకలు పుట్టుకు రావడంతో అతన్ని చూసి చాలా మంది భయపడుతున్నారు.కొంతమందేమో అతన్ని చూసి అవాక్కవుతున్నారు.

అసలు వొళ్ళంతా వెంట్రుకలు మొలవడం ఏంటి? అని అందరూ నోరెళ్లబెడుతున్నారు.

లలిత్‌ ఆరేళ్ల వయసు వరకు అందరిలాగానే సాధారణంగా ఉన్నాడు.

అప్పట్లో అతడు బాడీపై అసలు వెంట్రుకలు అనేవి లేవు.కానీ ఆరేళ్ల సమయం నుంచి అతడి శరీరంపై మెల్లమెల్లగా వెంట్రుకలు రావడం మొదలుపెట్టాయి.17 ఏళ్ల వయసు వచ్చేసరికి అతని ఒళ్ళంతా దిట్టంగా వెంట్రుకలు వచ్చాయి.దీనివల్ల ఆ అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు.

స్కూల్లో తోటి పిల్లలు ఇతడి సమస్యను చూసి ఎగతాళి చేస్తుండడం, ఎక్కిరించడం అతడిని ఎంతో బాధిస్తోంది.అచ్చం జంతువుల వున్నావ్ అని కొందరు కామెంట్ చేస్తుంటే అతను తట్టుకోలేకపోతున్నాడు.

వెంట్రుకలు రాగానే అతను ట్రిమ్ చేసుకుంటున్నా మళ్ళీ వెంట్రుకలు రెట్టింపు మోతాదులో పెరుగుతున్నాయట.మధ్య యుగం నాటి పురుషులలో ఇలాగే వెంట్రుకలు మొలిచేవట.అలానే ఇప్పుడు కూడా లలిత్‌కి కూడా వెంట్రుకలు రావడంతో దీని గురించి చాలామంది చర్చించుకుంటున్నారు.ఒకవేళ అతని పూర్వికుల డీఎన్‌ఏ వచ్చిందేమో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మధ్య యుగం నుంచి ఇప్పటివరకు దాదాపు 50 మంది దాకా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.

Telugu Lalit Patidar, Madhya Pradesh, Rare Medical, Weird Diseases-Latest News -

ఈ సమస్య ఒకసారి వస్తే తగ్గదు కాబట్టి అతను జీవితకాలం ఇలా ఒంటి నిండా వెంట్రుకలతో జీవించక తప్పదు.జన్యుపరమైన లోపాలు లేదా వేర్ వుల్ఫ్ సిండ్రోమ్ వల్ల ఈ సమస్య ఉత్పన్నమై ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.ఇది పెద్ద ప్రాణాంతకమైన సమస్య కాదని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.

కానీ సూటిపోటి మాటలు అతడిని ఎంతగానో బాధిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube