తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది.ఈ మేరకు 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
ఇప్పటికే మొదటి జాబితాలో 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ రెండో జాబితాలో ఒక్కరికి, మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులకు స్థానం కల్పించింది.మిగిలిన స్థానాలకు త్వరలోనే తుది జాబితాను ప్రకటించనుంది.
మరోవైపు జనసేనతో పొత్తు నేపథ్యంలో కొన్ని స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది.ఈ క్రమంలోనే కూకట్ పల్లి, నాంపల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్ గిరి తో పాటు కంటోన్మెంట్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది.
కాగా మూడో జాబితాలో అభ్యర్థుల వివరాలు.: ఆసిఫాబాద్-అజ్మీరా ఆత్మారామ్ నాయక్, మంచిర్యాల – వి రఘునాథ్, బాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణ, మంథని-చందుపట్ల అనిల్‌రెడ్డి, బోధన్-వద్ది మోహన్‌రెడ్డి, అంబర్‌పేట – కృష్ణాయాదవ్, సికింద్రాబాద్ – మేకల సారంగపాణి, నారాయణపేట్ – కేఆర్ పాండు రెడ్డి, జూబ్లీహిల్స్ – లంకల దీపక్‌రెడ్డి, ముషీరాబాద్ – పూస రాజు, పరిగి- మారుతీ కిరణ్, చేవెళ్ల- కేఎస్ రత్నం, రాజేంద్రనగర్- తోకల శ్రీనివాసరెడ్డి, ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీనగర్ – సామారంగారెడ్డి, సనత్‌నగర్ – మర్రి శశిధర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ – దినేశ్ కులచారి, మెదక్ – విజయ్ కుమార్, నారాయణ్ ఖేడ్ – సంగప్ప, అందోల్ – బాబుమోహన్, జహీరాబాద్ – రామచంద్ర రాజనర్సింహ, పరిగి – మారుతి కిరణ్, ముషీరాబాద్ – పూస రాజు, మలక్ పేట్ – సామ్ రెడ్డి సురేందర్ రెడ్డి, సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి, జడ్చర్ల – చిత్తరంజన్ దాస్,, మక్తల్ – జలంధర్ రెడ్డి,, వనపర్తి – అశ్వత్థామ రెడ్డి, అచ్చంపేట్ – డి సతీష్, షాద్ నగర్ – అందె బాబయ్య, దేవరకొండ – కేతావత్ లాలూ నాయక్,.