ఫైజర్ కంపెనీ షాకింగ్ స్టేట్మెంట్...బిడెన్ మైండ్ బ్లాక్ అయినట్టేగా...??

అమెరికాలో కరోనా మహమ్మారి థర్డ్ వేరియంట్ డెల్టా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే.గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.

కరోనా మొదటి వేవ్ ధాటిని తట్టుకోలేక చేతులు ఎత్తేసిన అమెరికా ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చిన తరువాత ఊపిరి పీల్చుకుంది.ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత పూర్తిగా కరోనా పై నియంత్రణ చేయగలింది.

అయితే ఫైజర్ వ్యాక్సిన్ మొదటి సెకండ్ వేరియంట్ , మొదటి వేరియంట్ లపై సమర్ధవంతంగా పనిచేయడంతో ఫైజర్ వ్యాక్సిన్ కు డిమాండ్ బాగా పెరింది.అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు.

ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే కరోనారాకుండా అడ్డుకోవచ్చని ప్రకటించారు.కానీ అమెరికా వ్యాప్తంగా ఉన్న వారిలో ఇప్పటి వరకూ కేవలం 50 శాతం మాత్రమే ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్నారని మరో 50 శాతం మందికి ఇంకా వ్యాక్సిన్ వేయాల్సి ఉందని తెలియడంతో గడిచిన కొన్ని రోజులుగా వ్యాక్సిన్ వేసుకోండి అంటూ బిడెన్ ఎప్పటికపుడు ప్రజలను అలర్ట్ చేస్తూనే ఉన్నారు.

Advertisement

మొదటి డోస్ వేసుకుని రెండవ డోస్ వేసుకొని వారు, అసలు వ్యాక్సిన్ వేసుకొని వారు ఉన్నారని తేలడంతో మళ్ళీ మొదటి వేవ్ పరిస్థితి ఎక్కడ రిపీట్ అవుతుందోనని బిడెన్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.అయితే క్రమంలోనే.

ఫైజర్ కంపెనీ చావు కబురు చల్లగా చెప్పింది.అమెరికాలో డెల్టా వేరియంట్ కేసులు తీవ్రస్తాయిలో నమోదు అవుతున్న క్రమంలో తమ వ్యాక్సిన్ ప్రభావం డెల్టా వేరియంట్ పై కాస్త తగ్గుతోందని బాంబు పేల్చింది.గత వైరస్ లపై ఫైజర్ 90 శాతం సమర్దవంతంగా పనిచేయగా డెల్టా పై పనిచేసే తీరు 84 శాతానికి పడిపోయిందని, డెల్టా పై ఫైజర్ ప్రభావం చూపాలంటే మూడవ డోస్ తప్పని సరి చేయాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.

మూడవ డోస్ తీసుకున్న వారిలో యాంటీ బాడీస్ అధికంగా ఉంటున్నాయని చెప్పింది.తాజాగా ఫైజర్ ప్రకటనతో బిడెన్ బిత్తర పోయినంత పని అయ్యింది.అసలు వ్యాక్సిన్ వేసుకోవడం లేదు అనుకుంటుంటే, మొదటి డోస్ వేసుకున్న వాళ్ళు రెండవ డోస్ వేసుకోవడం లేదంటుంటే ఇప్పుడు మూడవ డోస్ వేయడం ఎలా అంటూ అధికారులు షాక్ లో ఉన్నారట.

ఫైజర్ ప్రకటనపై బిడెన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు