డొనేషన్ బాక్స్ కొట్టేయడానికి గుర్రంపై వచ్చిన దొంగలు.. లాస్ట్ ట్విస్ట్ అసలు ఊహించరు..

ఉత్తరప్రదేశ్‌( Uttar Pradesh ) రాష్ట్రం, కాన్పూర్‌ సిటీలోని ఒక ఆలయంలో సాహసోపేతమైన దోపిడీ ప్రయత్నం కామెడీ సీన్‌గా మారింది.ఈ దొంగలు ఆలయం ముందు ఉంచిన డొనేషన్ బాక్స్‌ను దోచుకోవడానికి వచ్చారు.

 Thieves Came On Horse To Hit The Donation Box Last Twist Is Not Expected ,  Vir-TeluguStop.com

ఏదో పెద్ద దోపిడీ చేస్తున్నట్లు గుర్రం వేసుకొని మరీ వారు వచ్చారు.కానీ ఆ దొంగలను చూసి కుక్కలు మొరిగాయి, దాంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు.

స్థానికులు వెంటపడటంతో దొంగలు అక్కడి నుంచి పరుగులు తీశారు.వారు గుర్రంపై రావడం నుంచి స్థానికులు తరిమికొట్టడం వరకు ఒక కామెడీ సీన్ లాగా అనిపించింది.

ఈ తతంగమంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వగా, ఆ వీడియో సోషల్ మీడియా( Social media )లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఈ సంఘటన 2023, డిసెంబర్ 20న రాత్రి కాన్పూర్ జిల్లాలోని బర్రా-6 ప్రాంతంలోని రాధాకృష్ణ ఆలయంలో జరిగింది.

ఈ ఆలయం దేవతకు ప్రార్థనలు, విరాళాలు అందించే భక్తులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం.ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉంచిన డొనేషన్ బాక్స్‌ను స్టీల్ రెయిలింగ్‌తో సెక్యూర్ చేశారు.

ఇందులో లక్షల రూపాయల విలువైన నగదు, విలువైన వస్తువులు ఉన్నాయి.సీసీటీవీ ఫుటేజీ( CCTV footage ) ప్రకారం ఇద్దరు వ్యక్తులు గుర్రపు స్వారీ చేస్తూ గుడి వద్దకు వస్తున్నట్లు తెలుస్తోంది.

వారిలో ఒకరు తన గుర్రంపై నుంచి దిగి, తాడు, ఒక వస్తువు ఉపయోగించి డొనేషన్ బాక్స్‌ను ఊడబీకేందుకు ప్రయత్నిస్తాడు.అవతలి వ్యక్తి గుర్రం మీద ఉండి ఎవరైనా వస్తున్నారో లేదో గమనిస్తున్నాడు.

ఇంతలోనే వీధికుక్కల గుంపు దొంగలను గ్రహించి వారిపై బిగ్గరగా మొరగడం ప్రారంభించాయి.

కుక్కల అరుపులు విని స్థానికుల లేచారు, ఏమి జరుగుతుందో చూసేందుకు ఆలయానికి చేరుకున్నారు.రెడ్‌హ్యాండెడ్‌గా తమ ప్రయత్నాలు బహిర్గతమయ్యాయని గ్రహించిన దొంగలు, బాక్స్ వదిలిపెట్టి, గుర్రంపై అక్కడి నుంచి పారిపోయారు.స్థానికులు దొంగలను వెంబడించారు, కానీ వారు చీకటిలో తప్పించుకోగలిగారు.

అనంతరం ఆలయ అధికారులు పోలీసులకు( Police ) ఫిర్యాదు చేసి సీసీటీవీ ఫుటేజీని అందించారు.నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు వీడియో, ఇతర ఆధారాలతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆలయం, ఇతర మత స్థలాల చుట్టూ పోలీసులు భద్రతను పెంచారు.ఈ దోపిడీ ప్రయత్నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది, చాలా మంది నెటిజన్లు దొంగల మూర్ఖత్వానికి వెక్కిరిస్తూ, కుక్కల ధైర్యసాహసాలకు ప్రశంసించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube