తాళం లేకుండానే బైక్‌ను స్టార్ట్ చేశాడు..ఏం తెలివిరా నాయనా..?

Thief Started The Bike Without A Lock Intelligent Thief, Theft, Crime, Bike Theft, Latest News, Viral News, Police

దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి అందినకాడికి దొచుకుంటారు.బంగారం, నగదు, విలువైన వస్తువులు తీసుకుని పరార్ అవుతారు.

 Thief Started The Bike Without A Lock Intelligent Thief, Theft, Crime, Bike The-TeluguStop.com

ఇక రోడ్డుపై వెళ్లేటప్పుడు కత్తులతో బెదిరించడం, దాడి చేసి డబ్బులు తీసుకెళ్లే దొంగలు కూడా ఉంటారు.ఇక బస్టాండ్, రైల్వే స్టేషన్లు వంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా దొంగలు మాటు వేసి ఉంటారు.

మనం హడావుడిగా ఉన్న సమయంలో మనకు తెలియకుండా డబ్బులు దొచేస్తారు.దొంగలు పట్టుబడితే వారికి మనం దేహశుద్ధి చేసి పోలీసులకు( Police ) అప్పగిస్తాం.

వారిని కొట్టడంతో పాటు తిడతాం.కానీ ఒక దొంగను చూసి మాత్రం జనాలు మురిసిపోతున్నారు.

అతడి టాలెంట్ కు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇంతకు అతడు ఏం చేశాడంటే.

ఒక దొంగను పోలీస్ పట్టుకుని బైక్ ను ఎలా దొంగతనం చేస్తావో చూపించాలని కోరాడు.దీంతో సదరు దొంగను( Thief) ఒక బైక్ దగ్గరకు తీసుకెళ్లి చూపించమని పోలీస్ ప్రశ్నించాడు దీంతో యువకుడు సెంటర్ స్టాండ్ చేసి ఉన్న బండి ఎక్కి రెండు కాళ్లతో హ్యాండిల్ ను నొక్కి పెట్టాడు.ఆ తర్వాత హ్యాండిల్ ను కాళ్లతో తిప్పగానే ఒక్కసారిగా లాక్ ఊడిపోయింది.ఆ తర్వాత హ్యాండిల్ పక్కన ఉన్న వైర్లను బయటకు లాగి వాటిపై ఉన్న ఇన్యూలేషన్ తీసి మరో విధంగా వైర్లను కలపడంతో బైక్ స్టార్ట్ అయింది.

దీంతో అతడి టాలెంట్ ను చూసి అందరూ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు.అక్కడ ఉన్న కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియా( Social media )లో పోస్ట్ చేశారు.దీంతో వీడియో కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోలో యువకుడి టాలెంట్ చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.కానీ ఇతడు తన టాలెంట్ ను దొంగతనాలపై కాకుండా మంచి పనులపై పెడితే బాగుపడేవాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.ఇలాంటోడు బైక్ ను టార్గెట్ చేస్తే ఇక అంతే సంగతులు అని మరొకరు వ్యాఖ్యానించగా.

ఇతడు దారి తప్పి దొంగ అయ్యాడని మరొక నెటిజన్ తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube