ఎంతకు తెగించార్రా .. ఫోన్ చేసుకొని ఇస్తానిని చెప్పి..?

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఎవరికైనా సహాయం చేయాలన్నా కూడా ఆలోచించవలసిన పరిస్థితులు వచ్చాయి.అయ్యో పాపం.

అని మనం సహాయం చేస్తే అది మనకు మేలు చేయడం పక్కన పెడితే.కీడు చేయడం మాత్రం కచ్చితంగా జరుగుతోంది.

అందుకు తాజాగా జరిగిన సంఘటన ఒక చక్కటి ఉదాహరణ అనే చెప్పాలి. ఫోన్ మాట్లాడతానని ఫోన్ ఇప్పించుకున్న ఒక దుండగుడు సహాయం చేసిన ఆ మహిళను మోసం చేసి అక్కడి నుంచి పరుగులు పెట్టినాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.

Advertisement

పాడేరు ఏజెన్సీ( Paderu ) వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంకులో ఒక మహిళ పనిచేస్తూ ఉంది.ఈ క్రమంలో ఆ మహిళా పని చేసుకుంటూ ఉండగా ఒక కేటుగాడు ఆ మహిళ వద్దకు వచ్చి అక్క కాస్త మీ ఫోన్ ఇస్తారా.అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి అంటూ రిక్వెస్ట్ చేశాడు.

అయ్యో పాపం.అని ఆ మహిళ అతడిని నమ్మి అతనికి తన ఫోన్ ఇచ్చింది.

ఇక అంతే.ఆ కేటుగాడు తెలివిగా ఎవరికో ఫోన్ చేస్తున్నట్లు నటిస్తున్నాడు.

ఈ క్రమంలో పెట్రోల్ బంకులో ఆ మహిళ బైక్ కు పెట్రోల్ కొడుతున్న సమయంలో మాట్లాడినట్టు మాట్లాడి పక్కకు పోయి ఇదే సరైన సమయమని అక్కడి నుంచి పరార్ అయిపోయాడు ఆ దుండగుడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియో పోలీసులు( Police ) గమనించి సదరు నిందితుడిని పట్టుకొని ఆ మహిళకు ఫోను మళ్లీ తిరిగి ఇచ్చేలాగా చేయాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ వీడియో : నదులుగా మారిన హైదరాబాద్ రోడ్లు.. నీళ్లలో తేలుతున్న వాహనాలు..
12 విభాగాల్లో నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చాటిన ఏపీ యువతి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.

Advertisement

తాజా వార్తలు