జగన్ చేసిన పనికి వారు పాలాభిషేకం చేసేశారు !

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు.అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

 They Performed Milk Abhishekam For Jagans Work ,nayi Brahmins, Ap Cm Jagan,jagan-TeluguStop.com

ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పాటు, తమ రాజకీయ ప్రత్యర్ధులు అంతా ఏకమవుతూ.కులాల వారిగా మద్దతు పొందే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో జగన్ కూడా స్పీడ్ పెంచారు.

దీనిలో భాగంగానే నాయి బ్రాహ్మణులకు( Nayi Brahmins ) రాష్ట్రంలోని ప్రతి దేవాలయ పాలక వర్గాల్లో అవకాశం కల్పిస్తూ ఏపీ క్యాబినెట్( AP Cabinet ) నిర్ణయం తీసుకుంది.

Telugu Ap Cm Jagan, Ap, Endomwnt, Jagan, Nayi Brahmins, Yanadayya, Ysrcp-Politic

ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేయడమే కాకుండా,  జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ మేరకు నాయి బ్రాహ్మణ జే ఏ సి నేతలతో పాటు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య,  దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు,  నగర మేయర్ భాగ్యలక్ష్మి , దుర్గ గుడి కేశఖండనశాల క్షురకులు జగన్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని ప్రశంసలు కురిపించారు.తమ విషయంలో జగన్ పెద్దమనసు చాటుకున్నారని,  ఎన్ని ప్రభుత్వాలు మారినా, నాయి బ్రాహ్మణులను ఎవరు గుర్తించలేదని, కానీ జగన్ తమకు ప్రాధాన్యం ఎక్కువగా కల్పిస్తున్నారని వారు ప్రశంసించారు.

Telugu Ap Cm Jagan, Ap, Endomwnt, Jagan, Nayi Brahmins, Yanadayya, Ysrcp-Politic

గత టిడిపి ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణుల సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తే అవమానకరంగా మాట్లాడారని,  ఇదే సేవకులు బానిసలు కాదు పాలకులు చేస్తానన్న జగన్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని,  దేవాలయాల్లో మా సమస్యలపై చర్చ జరిగేది కాదని,  జగన్ ఇప్పుడు పాలకవర్గంలో భాగస్వామ్యం చేయడం మరువలేనిదని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య జగన్  రుణపడి ఉన్నామని అన్నారు.దేవాలయాల్లో పనిచేసే బ్రాహ్మణులకు కనీస వేతనం 20వేల రూపాయలు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అంటూ ఆయన కొనియాడారు .ఇక రాష్ట్రవ్యాప్తంగా ను అనేక చోట్ల జగన్ చిత్రానికి పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube