రేవంత్ క్యాబినెట్ లో ఛాన్స్ వీరికే ! ? 

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ( Revanth Reddy )బాధ్యతలు స్వీకరించబోతున్నారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

 They Have A Chance In Revanth's Cabinet! , Telangana Elections, Telangana Gov-TeluguStop.com

ఢిల్లీ కాంగ్రెస్ అగ్ర నేతలంతా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు.  అలాగే వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు,  ఇతర కీలక నాయకులను తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని రేవంత్ నిర్ణయించుకున్నారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో తెలంగాణ క్యాబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది .తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలు ఉన్నాయి.  సభ్యుల సంఖ్యలో 15% మించి క్యాబినెట్ ఉండకూడదు.దీని ప్రకారం చూసుకుంటే కొత్త క్యాబినెట్ లో 18 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది.  స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ ఇద్దరు విప్ లను కలుపుకుంటే మొత్తం 23 మందికి అవకాశం ఉంటుంది .అయితే రేవంత్ క్యాబినెట్ లో చోటు దక్కించుకునేందుకు చాలామంది పోటీ పడుతున్నారు.

Telugu Brs, Konda Surekha, Mallubhatti, Sithakka, Telanganacm, Telangana-Politic

 ముఖ్యంగా పార్టీ సీనియర్లు తమకు కీలకమైన పదవులు ఇవ్వాలని ఒత్తిళ్లు అప్పుడే మొదలుపెట్టారు. ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం పెద్దల వద్ద మల్లు భట్టు విక్రమార్క ( Mallu Bhatti vikramarka )వంటి వారు మంతనాలు చేపట్టారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డికి( Uttamkumar Reddy ) పిసిసి అధ్యక్ష పదవి కట్టబడితే ఆయన సతీమణి పద్మావతికి తెలంగాణ క్యాబినెట్ లో అవకాశం కల్పిస్తారా అనేది తేలాల్సి ఉంది.  ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి , రాజగోపాల్ రెడ్డి లలో ఎవరికి ఛాన్స్ దక్కబోతోంది,  ఖమ్మం జిల్లాలో కీలక నేతలుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  తుమ్మల నాగేశ్వరరావుకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.

  అలాగే ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ఏ కీలక పదవి దక్కబోతోంది.  ఇక మరో పార్టీ సీనియర్ నేత కొండ సురేఖ పరిస్థితి ఏమిటి? ఎలా అనేక అంశాలు ఆసక్తికరంగా మారాయి.  ఇక సీనియర్లు చాలామంది క్యాబినెట్ లో చోటు కోసం ప్రయత్నాలు చేస్తుండగానే యువ నాయకులు సైతం మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.దీంతో జిల్లాలు సామాజిక వర్గాలు లెక్కల ప్రకారం కొత్త క్యాబినెట్ కొలువుతీరే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ సీనియర్లు జీవన్ రెడ్డి , జగ్గారెడ్డి వంటి వారు పదవులపై ఆశలు పెట్టుకున్నారు.  అలాగే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి పేరు ప్రస్తావనకు వస్తోంది .అలాగే వివేక్ సైతం మంత్రి పదవి విషయంలో ఆశలు పెట్టుకున్నారు.  ఇక కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఎం కూడా పొత్తులో భాగంగా హామీ ఇచ్చిన మేరకు తమకు రెండు ఎమ్మెల్సీలు వస్తాయని ఆశలు పెట్టుకుంది.ఇదిలా ఉంటే కాంగ్రెస్ కీలక నేతలు అందించిన సమాచారం మేరకు , కొత్త క్యాబినెట్ లో సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం దక్కించుకోబోతున్న నేతల వివరాలు ఇవే…

Telugu Brs, Konda Surekha, Mallubhatti, Sithakka, Telanganacm, Telangana-Politic

ఎస్సీ సామాజిక వర్గంమల్లు భట్టి విక్రమార్క, గడ్డం వివేక్ లేదా గడ్డం వినోద్ దామోదర రాజనర్సింహ, వంశీకృష్ణ, అద్దంకి దయాకర్ ( ఎమ్మెల్సీ కోటాలో )బీసీ సామాజిక వర్గంపొన్నం ప్రభాకర్, ( గౌడ్ ), శ్రీహరి ( ముదిరాజ్ ), బీర్ల ఐలయ్య ( యాదవ్ ), ఆది శ్రీనివాస్ (మున్నూరు కాపు ), కొండా సురేఖ( Konda surekha ) (పద్మశాలి),  ఈర్లపల్లి శంకర్ (చాకలి ),ఎస్టి సామాజిక వర్గం సీతక్క ( అనసూయ )కమ్మ సామాజిక వర్గంతుమ్మల నాగేశ్వరరావు( Tummala Nageswara Rao )వెలమ సామాజిక వర్గంప్రేమ్ సాగర్ రావు, జూపల్లి కృష్ణారావు, గండ్ర సత్యనారాయణ,రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలామంది కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి.  వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.అయితే ఈ జాబితాలో ఉన్న వారికి మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతున్నా అంతిమంగా కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుని లిస్టును ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube