కువైట్‌లో నన్ను చంపేసేలా ఉన్నారు.. దయచేసి కాపాడాంటి అంటూ (వీడియో)

భారతదేశంలో చాలామంది బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లడం మామూలుగానే చూస్తూనే ఉన్నాము.ఈ నేపథ్యంలో కొందరు అన్ని ప్రక్రియలు సరిగా పూర్తిచేసుకుని అక్కడ జీవనోపాధి పొందుతున్నారు.

అయితే, మరికొందరు మాత్రం అడ్డదారులలో విదేశాలకు వెళ్లి అక్కడ నానా అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతున్నారు.అయితే, విదేశాలకు వెళ్ళిన సమయంలో మన అదృష్టం బాగుంటే సరిపోతుంది.

లేకపోతే అక్కడ వారి యజమానులు పెట్టే చిత్రహింసలవల్ల అనేక ఇబ్బందులలో ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూసాము.

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేకమంది అరబ్ దేశాలలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో.వాటి నుంచి తమల్ని కాపాడాలంటూ రాజకీయ నాయకులకు వీడియోలు తీసి పంపించిన సంఘటనలు చాలానే చూసాము.

Advertisement
They Are Trying To Kill Me In Kuwait , Please Save Me, Social Media, Viral Video

తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

They Are Trying To Kill Me In Kuwait , Please Save Me, Social Media, Viral Video

కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన ఓ మహిళ కువైట్ కు వెళ్లి అక్కడ పని చేసుకుంటుంది.అయితే, తాను పనిచేసే దగ్గర పడుతున్న చిత్రహించలకు సంబంధించి రహస్యంగా ఓ వీడియో తీసి ఆ వీడియోలు వారి బంధువులకు పంపించింది.ఈ ఘటన నియోజవర్గంలో ప్రస్తుతం తెగ కలకల రేపింది.

ఈ వీడియోలో సదరు మహిళ తనకు సరిగా భోజనం పెట్టడం లేదని.తనని చంపేసేలా ఉన్నారని.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

తనని కాపాడన్నట్టు వీడియో చేసింది.ఎలాగైనా తనని తన పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటి పర్యవంతం అవుతుంది.

They Are Trying To Kill Me In Kuwait , Please Save Me, Social Media, Viral Video
Advertisement

ఇక అమ్మాయిల విషయానికి వస్తే.కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలం ఎల్లమెల్లి గ్రామానికి చెందిన కుమారి శ్తోగా అధికారులు గుర్తించారు.ఆమెకు 19 ఏళ్ల క్రితం వివాహం అయిందని ఇద్దరు ఆడపిల్లలు ఓ కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆవిడ భర్త వెంకటేష్, ఐదువేల క్రితం మృతి చెందడంతో పిల్లలతో సహా ఎల్లమెల్లిలో ఉండేది.భర్త చనిపోవడంతో వారి పిల్లల పోషణ, కుటుంబ భారం తలపై పడటంతో బతుకు తెరవు కోసం పనిచేస్తున్న నేపథ్యంలో సంపాదన కోసం కువైట్ వెళ్లాలని నిర్ణయం తీసుకుని అక్కడికి వెళ్లింది.

ఈ నేపథ్యంలో పాలకొల్లుకు చెందిన సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో ఆవిడ కువైట్ లోని జబ్రాలి అహ్మద్ నగరంలో ఇంట్లో పనికి చేరింది.అలా వెళ్లిన ఆవిడకు 7 నెలల కాలంలో తాను పలు సమస్యలను ఎదుర్కొన్నట్లు, అనేక చిత్రహింసలు గురవుతున్నట్లు వీడియో ద్వారా తెలిపింది.

ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆమెను ఎలాగైనా తన పిల్లల వద్దకు చేర్చాలని కోరుతున్నారు.

తాజా వార్తలు