కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ మోదీ సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలపై పోరాటం చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.అదానీ సంస్థ అక్రమాలపై కేంద్రం ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు.
విపక్షాలు డిమాండ్ చేస్తున్నా జేపీసీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదో చెప్పాలన్నారు.యూపీఏ పాలనలో ఆరోపణలు వస్తే జేపీసీలు వేశామని తెలిపారు.
డొల్ల కంపెనీలతో వేల కోట్ల రూపాయలు లాభాలు గడించాయన్నారు.గతంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలతోనే స్పష్టం చేశారు.







