రేణుదేశాయ్‌కి పవన్ యాంటీ ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియాలో యుద్దం జరుగుతూనే ఉంది.ఇప్పటికే పలు సార్లు రేణు చేసిన ట్వీట్స్‌కు పవన్ యాంటీ ఫ్యాన్స్ చెత్త రీ ట్వీట్స్ చేసి, ఆమెతో చావాట్లు పెట్టించుకున్నారు.
తాజాగా మళ్లీ కూడా రేణు దేశాయ్ ట్విట్టర్‌లో తన కోపాన్ని ప్రదర్శించింది.తన పిల్లల గురించి చేసిన ట్వీట్‌కు పవన్ యాంటీ ఫ్యాన్స్ ఎక్కువగా రియాక్ట్ అవ్వడంతో పాటు, చెత్త కామెంట్స్ చేయడంతో రేణుదేశాయ్ ఫైర్ అయ్యింది.
పవన్ యాంటీ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యాన్స్‌తో కూడా రేణుదేశాయ్ వివాదానికి దిగుతోంది.ఇద్దరు పిల్లల గురించి రేణు చేసిన ట్వీట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
‘ఇద్దరు కూడా నా పిల్లలే.పవన్ కళ్యాణ్ పిల్లలు కాదు.
’ అంటూ రేణు ట్విట్టర్‌లో పేర్కొంది.ఉన్నట్లుండి రేణు ఇలా ఎందుకు అన్నది అనే విషయాన్ని పక్కకు పెడితే, ఏవో చెత్త కామెంట్స్‌కు, ట్విట్స్‌కు రియాక్ట్ అవ్వడం వెంటనే మానేయడం మంచిది అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
తన పని ఏదో తాను చేసుకుంటూ పోవాలి తప్ప, ఇతరులు చేసిన ఆరోపణలకు రియాక్ట్ అవ్వవద్దని సలహా ఇస్తున్నారు.మరి ఇప్పటికి అయినా రేణుదేశాయ్ కోపం తగ్గించుకుని, తన పని ఏదో తాను చూసుకుంటుందో చూడాలి.