సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి.మూవీ షూటింగ్ ఒక్కరోజు ఆగిపోయినా లక్షల్లో నష్టం వాటిల్లుతుంది.
అయితే ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు మాత్రం ఎంత పెద్ద సమస్య వచ్చినా అస్సలు టెన్షన్ పడరని తెలుస్తోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో అస్సలు కోపం రాని హీరోలలో మహేష్ బాబు ముందువరసలో ఉంటారు.
మహేష్ బాబు( Mahesh Babu ) ఎలాంటి సమస్య వచ్చినా కూల్ గా డీల్ చేస్తారని తెలుస్తోంది.

మరో స్టార్ హీరో నాగార్జున సైతం చిన్నచిన్న ఇబ్బందులను సులువుగానే పరిష్కరించుకునేలా అడుగులు వేస్తారని తెలుస్తోంది.బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాలను తన తెలివితేటలతో ఆయన జాగ్రత్తగా చక్కబెడతారని తెలుస్తోంది.మరో స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun) సైతం అస్సలు కోప్పడరని సరదాగా, సంతోషంగా ఉంటారని సమాచారం అందుతోంది.

మరో స్టార్ హీరో రామ్ చరణ్ కు చాలా రేర్ గా మాత్రమే కోపం వస్తుందని తెలుస్తోంది.ఈ హీరోకు ఓపిక, సహనం చాలా ఎక్కువ.అయితే అవతలి వాళ్లు మరీ హద్దులు దాటితే మాత్రం ఊరుకోరని తెలుస్తోంది.సీనియర్ హీరోలలో చిరంజీవి, వెంకటేశ్( Chiranjeevi, Venkatesh) కూడా అస్సలు కోప్పడరు అని సమాచారం.
అవతలి వ్యక్తులు చిరాకు తెప్పించినా ఈ హీరోలు సున్నితంగానే రియాక్ట్ అవుతారని తెలుస్తోంది.టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు తమ దగ్గర పని చేసే వ్యక్తుల విషయంలో సైతం ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.
టాలీవుడ్ హీరోలలో చాలామంది హీరోలు బంగారం అని ఆ హీరోల దగ్గర పని చేసే వ్యక్తులు చెబుతున్నారు.టాలీవుడ్ హీరోలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.టాలీవుడ్ స్టార్ హీరోలు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను అందుకుని ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.