ఇండియాలోని జనాలకి ఎంటటైన్మెంట్ కావాలంటే, ఒకే ఒక మాధ్యమాన్ని ఆశ్రయిస్తారు… అదే సినిమా.అందుకే ఇక్కడ దేనికీ లేనంటే క్రేజ్ సినిమాకి ఉంటుంది.
ఈ క్రమంలోనే చాలామంది సినిమా ప్రేమికులు ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్స్ ని ఇష్టపడుతూ ఉంటారు.మిగతా సినిమాలని లైట్ తీసుకుంటూ ఉంటారు.
అలాంటి వారికోసమే ఈ స్పెషల్ స్టోరీ.ఈమధ్యకాలంలో ఇటువంటి సినిమాలకు బాగా జనాదరణ పెరగడంతో దాదాపుగా చాలా సినిమాలు ప్రేక్షకులకి థ్రిల్లింగ్ కలిగించేవిగా ఉంటున్నాయి.
ఈ మధ్యకాలంలో చూసుకుంటే అమలాపాల్ నటించిన తమిళ సినిమా CADAVER (కాడవర్), RJ బాలాజీ నటించిన తమిళ సినిమా రన్ బేబీ రన్, హీరో నవీన్ చంద్ర నటించిన తమిళ సినిమా రిపీట్ గురించి ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిందే.ఈ మూడు సినిమాలు దాదాపుగా OTT వేదికలపై సూపర్ డూపర్ హిట్టుగా నిలిచాయి.
కరోనా తరువాత OTT సంస్థలకు బాగా డిమాండ్ బాగా పెరగడంతో ఇలాంటి ఇంటరెస్టింగ్ సినిమాలను తెరకెక్కించడం జరుగుతోంది.
ముందుగా… అమలాపాల్ నటించిన తమిళ సినిమా CADAVER (కాడవర్)( Cadaver ( సినిమా గురించి మాట్లాడుకోవాలి.2022వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.కాడవర్ అంటే తెలుగులో శవం అని అర్ధం.
పేరుకు తగ్గట్టే ఇందులో శవాలు జనాలను భయబ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి.అమలా పాల్ సొంత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా అమలా పాల్, రిత్విక, మునిష్కాంత్, త్రిగుణ్, హరీష్ ఉత్తమన్ మరియు అతుల్య రవి సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు.
నగరంలోని ప్రముఖ జెసి ఆసుపత్రికి చెందిన చీఫ్ హార్ట్ సర్జన్ సలీం రెహమాన్‌ని మిస్టరీ మ్యాన్ అపహరించి, దారుణంగా హత్య చేయడంతో స్టార్ట్ అయిన సినిమా ఆద్యంతం అలరిస్తుంది.
అదేవిధంగా తమిళనటుడు RJ బాలాజీ నటించిన తమిళ సినిమా రన్ బేబీ రన్ సినిమా( Run Baby Run ) గురించి మీకు తెలిసే ఉంటుంది.2023 లో విడుదలైన ఈ సినిమా ఆర్జే బాలాజీ సినిమా కెరీర్ లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది.ఏడు రోజుల తర్వాత జరిగిన కథగా మొదలైన ఏ చిత్రం చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
భార్యకు మంచి చెవి పోగులు కొని ఆశ్చర్యం కలిగించాలనుకున్న హీరో ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటాడో అన్నదే ప్రధాన కథ.సినిమా చూస్తున్నంత సేపు సగటు సినిమా ప్రేక్షకుడు హీరో పాత్రలో తనని తాను చూసుకుంటాడు.కచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా ఇది.ఇక మూడవది తెలుగు హీరో నవీన్ చంద్ర నటించిన తమిళ సినిమా రిపీట్( Repeat Movie ).ఈ సినిమా కూడా నవీన్ చంద్ర సినిమా కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాగా చెప్పుకోవచ్చు.2022లో విడుదలైన ఈ సినిమా నవీన్ చంద్ర సినిమా కెరీర్ లోనే ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు.డీజీపీ కూతురిని ఎవరో కిడ్నాప్ చేయగా, ఆమె కోసం ఒక సీక్రెట్ ఏజెంట్ ఒక ఆపరేషన్ నిర్వహిస్తాడు….అలా మొదలైన రిపీట్ అనే కథ ఎన్నో మలుపులు తిరుగుతూ రిపీట్ అవుతూ ఉంటుంది.
ఈ మూడు సినిమాలను మీరు చూడనట్లయితే, కచ్చితంగా మీరు ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయినట్లే!
.