Liver Health : అక్కడ దురదతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే.. లివర్ పై చెడు ప్రభావం పడినట్లే..!

శరీరంలో ప్రధాన అవయవాల్లో కాలేయం ( Liver ) ముఖ్యమైనది.

కాలేయం అనేది శరీరాన్ని నిర్విషీకరణ చేయడం, జీవక్రియ, పోషకాలను నిల్వ చేయడం వంటి విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఆల్కహాల్ తాగే వారిలో కాలేయ వ్యాధి ఎక్కువగా వస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.కానీ వైరల్ ఇన్ఫెక్షన్ ఊబకాయం, జన్యు శాస్త్రం వంటి కారణాలవల్ల ఏ వ్యక్తి అయినా దాని బారిన పడవచ్చు.

అటువంటి పరిస్థితిలో కాలేయన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, దానికి సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించడం ఎంతో ముఖ్యం.ఆ తర్వాత సకాలంలో చికిత్స తీసుకోవాలి.

ఎందుకంటే కాలేయ సమస్యల ప్రారంభ లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి.అటువంటి పరిస్థితిలో అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది.కాబట్టి కాలేయ వ్యాధికి( Liver Disease ) సంబంధించిన కొన్ని సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే నిరంతరం అలసట, బలహీనత, కాలేయ వ్యాధికి ప్రారంభ సంకేతాలు అని నిపుణులు చెబుతున్నారు.అటువంటి పరిస్థితిలో మీరు నిరంతరం అలసట, బలహీనతకు ఎదుర్కొన్నట్లయితే వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.

అలాగే ఉదరం పై భాగంలో నొప్పి కాలేయం వాపు కు సంకేతం.

ఈ నొప్పి తేలికపాటి నుంచి చాలా తీవ్రమైనదిగా ఉంటుంది.ఇది కొవ్వు పదార్థాలు తినే వారిలో త్వరగా పెరుగుతుంది.కానీ ఆ సమస్యల వల్ల మూత్రం రంగు( Urine Color ) కూడా మారవచ్చు.

సాధారణంగా ఈ స్థితిలో మూత్రం రంగు టీ రంగు లేదా గోధుమ రంగులోకి మారుతుంది.మూత్రంలో బిలిరుబిన్ ఉండడం వల్ల ఇది జరుగుతుంది.ఇంకా చెప్పాలంటే సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధులలో ద్రవం నిలుపుదల కారణంగా వాపు సంభవించవచ్చు.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

కాలేయ వ్యాధి ఉన్న రోగులకు చర్మం కింద పిత్త లవణాలు పేరుకుపోవడం వల్ల పేరుకుపోవడం ప్రురిటస్ అని కూడా పిలవబడే నిరంతర దురద( Itching ) ఉంటుంది.ఈ దురద ఎక్కడైనా రావచ్చు.

Advertisement

ఇది అరచేతులు అరికాళ్ళ పై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

తాజా వార్తలు