ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజురోజుకి దేశంలో ఊహించని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా అన్ లాక్ 1.0 మొదలైనప్పటి నుంచి ఈ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి.అయితే చాలామందికి కరోనా వైరస్ లక్షణాలు లేకపోవడంతో వారు యథేచ్ఛగా బయటికి వచ్చి అందరిలాగే పనులను కొనసాగిస్తున్నారు.దీనితో మరికొందరికి కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఇకపోతే ఇప్పటి వరకు కరోనా లక్షణాల్లో ముఖ్యంగా ఉండే జ్వరం, దగ్గు, జలుబు వాసన లేకపోవడం లాంటి లక్షణాలతో పాటు కొత్తగా మరో కొన్ని లక్షణాలను మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు.అయితే తాజాగా ఈ కరోనా లక్షణాలలో మరికొన్ని కొత్త లక్షణాలు వచ్చి చేరుతున్నాయి.
తాజాగా నమోదైన కేసులలో ఈ లక్షణాలను గుర్తించినట్లు వైద్యులు తెలియజేస్తున్నారు.తాజాగా నమోదైన కేసులలో చాలామందికి వికారంగా ఉండటం, వాంతులు అవ్వడం, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండటం లాంటి లక్షణాలను గుర్తిస్తున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.
ముఖ్యంగా కరోనా సోకినా రోగులకు వికారంగా ఉండడాన్ని గమనిస్తున్నారు.మరికొందరికి వాంతులతో సహా డయేరియా లక్షణాలు కూడా కనపడుతున్నాయని వైద్యులు తెలుపుతున్నారు.

కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే జాగ్రత్తపడి ముందుగా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు ప్రజలకు సూచనలు తెలియజేస్తున్నారు.మరికొంతమందికి షుగర్ లెవెల్స్ కూడా తక్కువ మోతాదు పడిపోవడం లాంటి లక్షణాలను గుర్తించినట్లు తెలుపుతున్నారు.అయితే ఇటువంటి వారికి ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.మరికొంతమందిలో దద్దుర్లు దురద వంటివి కూడా గ్రహించినట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.కరోనా వైరస్ ఇప్పటివరకు పదికి పైగా రూపాంతరాలు మార్చుకొని ప్రజలపై విచక్షణారహితంగా దాడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుంది.ఇక కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చేంతవరకు ఇలాంటి ఇబ్బందులు ప్రజలు పడక తప్పదు.