ఈ మధ్య కాలంలో కొందరు ప్రముఖ హీరోల మరణాలు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి.ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా మంచివాళ్లుగా పేరు తెచ్చుకున్న హీరోలు ప్రాణాలు కోల్పోవడం హాట్ టాపిక్ అవుతోంది.
నందమూరి తారకరత్న చీమకు కూడా హాని చేయరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.నందమూరి ఫ్యామిలీలో కూడా తారకరత్నను అందరూ ప్రత్యేకంగా అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.
తారకరత్న తన సినీ కెరీర్ లో 22 సినిమాలలో నటించగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.తారకరత్న నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియదు.
తారకరత్న జీవించి ఉంటే కెరీర్ పరంగా ఆయన మరింత బిజీ అయ్యేవారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య, ప్రభాస్ సినిమాలలో మంచి రోల్స్ పోషించే అవకాశం దక్కగా ఇదే సమయంలో తారకరత్న మృతి చెందారు.

శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ సైతం గుండె సంబంధిత సమస్యల వల్ల చిన్న వయస్సులోనే చనిపోయారు.పునీత్ పేద ప్రజల కోసం చేసిన సహాయాలు అన్నీఇన్నీ కావు.గొప్ప హీరోగా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ మరణం ఫ్యాన్స్ ను బాధ పెట్టింది.మరో ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సైతం మృతి చెందిన సంగతి తెలిసిందే.

సుశాంత్ మృతి విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.అయితే సుశాంత్ ను హత్య చేసినట్టు సరైన ఆధారాలు లభించలేదు.దేవుడు గొప్ప హీరోలు, మంచి హీరోలకే అన్యాయం చేస్తున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.కొంతమంది సినీ ప్రముఖుల మరణాలు అభిమానులను ఎంతగానో బాధ పెడుతుండటం గమనార్హం.
తారకరత్న మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.







