ప్రామిసరీ నోట్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.మనం డబ్బుల్ని వడ్డీకి ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోట్లు రాయించుకోవటం చేస్తుంటాం.
ఈ క్రమంలో సదరు ప్రామిసరీ నోట్లపై ఇచ్చే వారి వివరాలు, తీసుకునే వారి వివరాలు, తీసుకున్న మెుత్తం సొమ్ము, వడ్డీ రేటు, సాక్షి సంతకాలు వంటి వివరాలు వివరంగా రాస్తాము.అలాగే వీటిపైన స్టాంప్స్ మనం గమనించవచ్చు.
అయితే ఇలాంటి ప్రామిసరీ నోట్ల విషయంలో ఒకింత జాగ్రత్తలు అవసరం.ప్రామిసరీనోటు వాడేవారు వాటిపైన ఒకింత అవగాహన కలిగి ఉండాలి.
అసలేమీ ఐడియా లేకుండా కొందరు నోటు రాస్తుంటారు, రాయించుకుంటుంటారు.అలాంటిది అంత మంచిది కాదు.
ముఖ్యంగా మొదట అందరూ తెలుసుకోవలసింది ఏమంటే, ప్రామిసారి నోటుపై గరిష్ఠంగా మీరు కోటి రూపాయల వరకు డబ్బు లావాదేవీలు జరిపించవచ్చు.అనూహ్య కారణాల వలన కోర్టుకు వెళ్లవలసి వస్తే మీ వద్ద ప్రామిసరీ నోటు ఖచ్చితంగా ఉండాలి.3 సంవత్సరాల కాలంలో డబ్బు చెల్లింపులు పూర్తి కాకపోతే.గడువు ముగియక ముందుగానే తిరిగి కొత్త నోటు రాసుకోవాలి.
ఈ కాలంలో వడ్డీ, అసలు చెల్లింపులకు సంబంధించిన వివరాలను నోటు వెనుక భాగంలో ఇచ్చిన ఖాళీలో నమోదు చేసుకోవచ్చు.ఇక 3 సంవత్సరాల తరువాత ప్రామిసరీ నోటుకు కాలం చెల్లుతుంది.
ఆ తరువాత మీరు దానిని కోర్టుకు తీసుకెళ్లినా ఎటువంటి ఉపయోగం ఉండదు.

నోటు తిరిగి రాయించుకొనే అవకాశం లేకపోతే 29 లేదా 30వ నెలలో ఒక లాయర్ నోటీసు ఇవ్వాలి.ఇలా చేయటం వల్ల కాల దోషం అంతే సదరు నోటు యొక్క గడువు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.నెగోషియాబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం విస్తారమైనది.
ప్రామిసరీ నోటుపై స్టాంప్ అంటించే ముందు సంతకం తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.ఇలాంటి జాగ్రత్తలు పాటించటం వల్ల చట్టపరంగా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కోర్టులో మీకు తగిన మేలు చేకూరుతుంది.







