ఈ జ్యూసులు మలబద్ధకానికి సుల‌భంగా చెక్ పెడ‌తాయ‌ట‌..తెలుసా?

మలబద్ధకంప్ర‌పంచ‌వ్యాప్తంగా దీని బాధితులు కోట్ల‌లో ఉన్నారు.పెద్ద‌ల్లోనే కాదు.

పిల్ల‌ల్లోనూ ఈ స‌మ‌స్య ఎక్కువ‌గానే క‌నిపిస్తుంది.

ఈ మ‌ల‌బ‌ద్ధకాన్ని నిర్ల‌క్ష్యం చేస్తే తీవ్ర‌మైన కడుపు నొప్పి, జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మంద‌గించ‌డం, ఆక‌లి త‌గ్గి పోవ‌డం మ‌రియు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

అందుకే మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని ఎంత త్వ‌ర‌గా నివారించే అంత మంచిది.అయితే అందుకు కొన్ని కొన్ని జ్యూసులు అద్భుతంగా స‌మాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆల‌స్య‌మెందుకు ఆ జ్యూసులు ఏంటో చూసేయండి.ఆరెంజ్ జ్యూస్‌య‌మ్మీ య‌మ్మీగా ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

Advertisement

అదే స‌మ‌యంలో మ‌ల‌బ‌ద్ధాకన్ని నివారిస్తుంది.మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ ప‌డే వారు ప్ర‌తి రోజు ఒక గ్లాస్‌ ఆరెంజ్ జ్యూస్‌లో చిటికెడు న‌ల్ల మిరియాల పొడి క‌లిపి తీసుకుంటే.

క‌డుపంతా క్లీన్‌గా మారిపోతుంది.మ‌రియు ప‌దే ప‌దే మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య వేధించ‌కుండా ఉంటుంది.

అలాగే గ్రేప్ జ్యూస్ కూడా మ‌ల‌బ‌ద్ధ‌కానికి చెక్ పెట్ట‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.ఒక గ్లాస్ గ్రేప్ జ్యూస్‌లో ఒక స్పూన్ అల్లం ర‌సం క‌లిపి తీసుకుంటే మ‌రింత త్వ‌ర‌గా మ‌ల‌బ‌ద్ధ‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.మ‌రియు గ్రేప్ జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది.

రోగ నిరోధ‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.కిడ్నీలు శుభ్ర‌ప‌డ‌తాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

కంటి చూపు సైతం పెరుగుతుంది.ఇక మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నివారించ‌డంలో యాపిల్ జ్యూస్ సైతం సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

రోజుకు ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ సేవిస్తే.మ‌ల‌బ‌ద్ధ‌కం ప‌రార్ అవ్వ‌డ‌మే కాదు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరూ మెరుగు ప‌డుతుంది.

అదే స‌మ‌యం యాపిల్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ర‌క్త పోటు అదుపులో ఉంటుంది.శ‌రీరం శ‌క్తి వంతంగా మారుతుంది.

మ‌రియు బ‌రువు అదుపులో ఉంటుంది.

తాజా వార్తలు