రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ షో( Jabardasth ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రతి గురు శుక్రవారాలలో జబర్దస్త్ ఎక్స్ ట్రా, జబర్దస్త్ షో లు ప్రసారమవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
అంతేకాకుండా ఎంతోమందికి జబర్దస్త్ షో లైఫ్ ఇచ్చింది అన్న విషయం మనందరికీ తెలిసిందే.చాలామంది వెండితెరపై కూడా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇకపోతే జబర్దస్త్ షో ద్వారా చాలామంది ఆర్టిస్టులు బాగానే వెనకేసుకున్నారు అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.
జబర్దస్త్ ద్వారానే కాకుండా బాగా పాపులారిటి సంపాదించుకొని బయట ఈవెంట్లు సినిమాలలో అవకాశాలు పండుగ ఈవెంట్లు అంటూ భారీగానే సంపాదిస్తున్నారు.
ఇంకోవైపు అక్కడ వచ్చిన బ్రాండ్ వాడుకుంటూ సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్( Youtube Channels ) కూడా మొదలు పెట్టారు.ఒక్కరో ఇద్దరో కాదు చాలా మంది జబర్దస్త్ కమెడియన్‌లకు( Jabardasth Comedians ) సొంత యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి.
అందులో కొందరికి లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ కూడా ఉన్నారు.ఇక యూట్యూబ్ లో కూడా రకరకాల వీడియోలు షేర్ చేస్తూ యూట్యూబ్ ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నారు.
అంతేకాకుండా వీడియోలు చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ కూడా భారీగానే సంపాదిస్తున్నారు.మరి ఏ ఏ ఆర్టిస్టులు ఏ పేరుతో యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కమెడియన్ అదిరే అభి…( Adhire Abhi ) అమేజింగ్ అభి పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది.శాంతి స్వరూప్.( Shanti Swaroop ) షైనింగ్ శాంతి పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు.
దీవెన కూడా జబర్దస్త్ దీవెన పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది.జబర్దస్త్ చైల్డ్ ఆర్టిస్ట్ జబర్దస్త్ యోధ కూడా జబర్దస్త్ యోధ టీవీ( Jabardasth Yodha TV ) అనే యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తుంది.కేవలం వీరు మాత్రమే కాకుండా సునామీ సుధాకర్,( Tsunami Sudhakar ) అదుర్స్ ఆనంద్, మహిధర్, గడ్డం నవీన్, జబర్దస్త్ నరేష్, జబర్దస్త్ పరదేశి, జబర్దస్త్ వర్ష, రాకింగ్ రాకేష్, అవినాష్, నూకరాజు, రోహిణి, అనసూయ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.
వీరంతా కూడా జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు.