ఈ ఐదు రకాల వ్యక్తులు అంజీర్ తింటే లాభాలే లాభాలు..!

అంజీర్ ( Fig )గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే అంజీర్ ఖరీదు ఎక్కువే అయినప్పటికీ.

అందుకు తగ్గ పోషకాలు అందులో మెండుగా ఉంటాయి.అంజీర్ లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్, జింక్ వంటి మినరల్స్ తో పాటు విటమిన్స్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలను అంజీర్ ద్వారా పొందవచ్చు.

అయితే అంజీర్ సాధారణ వ్యక్తుల కంటే ఇప్పుడు చెప్ప‌బోయే ఐదు రకాల వ్యక్తులకు మరింత ప్రయోజనకరం.మరి ఆ ఐదు రకాల వ్యక్తులు ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముకల బలహీనతతో బాధపడే వారికి అంజీర్ ఒక వరమనే చెప్పుకోవచ్చు.రోజు ఉదయం నైట్ అంతా నీటిలో నానబెట్టిన రెండు అంజీర్లను తింటే ఎముకలు పుష్టిగా మారతాయి.

Advertisement

అంజీర్ లో కాల్షియం( Calcium ) మెండుగా ఉంటుంది.ఇది బలమైన ఎముకలు మరియు దంతాలకు మద్దతు ఇస్తుంది.

ఎముకల బలహీనతను దూరం చేస్తుంది.

అలాగే వెయిట్ లాస్ ( Weight loss )అవ్వాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులను నిత్యం అంజీర్ ను తీసుకోమని నిపుణులు సూచిస్తున్నారు.అంజీర్‌ లో ఉండే ఫైబర్ కంటెంట్ క‌డుపు నిండిన అనుభూతిని అందిస్తుంది.అనవసరమైన కోరికలను మరియు అతిగా తినడాన్ని అరికడుతుంది.

అదనంగా ఇది జీవక్రియను పెంచుతుంది.బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఎవరైతే తరచూ మలబద్ధకం( Constipation ) సమస్యతో బాధపడతారో వారు నిత్యం రెండు అంజీర్లను తినడం ఎంతో ఉత్తమం.అంజీర్ డైటరీ ఫైబర్ యొక్క గొప్ప మూలం.

Advertisement

ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.మలబద్ధకం సమస్య మీ దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.

బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉండే వారికి కూడా అంజీర్ ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు.అంజీర్ లో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ల కలయిక రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.శరీరాన్ని అంటువ్యాధులు మరియు వ్యాధులకు వ్య‌తిరేఖంగా త‌యారు చేస్తుంది.

ఇక అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు నిత్యం రెండు అంజీర్లను తింటే ఎంతో మేలు.అంజీర్ లో ఉండే పోషకాలు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

జుట్టు రాలడాన్ని అరికడతాయి.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

తాజా వార్తలు