కేవలం డబ్బుల కోసమే ఆ సినిమాలు చేసిన సెలబ్రిటీస్.. స్టార్ హీరోయిన్ కూడా..?

విక్రమ్, సూర్య, సాయి పల్లవి లాంటి యాక్టర్స్‌ సినిమాని ఒక ఆర్ట్ లాగా చూస్తారు.డబ్బు సంపాదించడం వారికి సెకండరీ.

మంచి కథ, రోల్ దొరికితేనే సినిమా చేస్తారు, లేకపోతే ఎన్నేళ్లయినా ఖాళీగా ఉంటారు.కొంతమంది యాక్టర్లు మాత్రం కేవలం డబ్బు కోసమే కొన్ని సినిమాలు చేసి షాక్ ఇచ్చారు.

అలాగని వారిని తప్పు పట్టలేము.డబ్బు అవసరమై వాళ్లు సినిమాల నచ్చకపోయినా వాటిలో నటించాల్సి వచ్చింది.

మరి వారెవరో తెలుసుకుందాం.

• సందీప్ కిషన్

ప్రస్థానం, రొటీన్ లవ్ స్టోరీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాలను తీసి ఎంతగానో అలరించిన సందీప్ కిషన్( Sundeep Kishan ) ఒకానొక సమయంలో కేవలం డబ్బు కోసమే ఒక సినిమా చేశాడు.

Advertisement

ఆ మూవీ మరేదో కాదు ధనుష్ హీరోగా నటించిన "కెప్టెన్ మిల్లర్ (2024)".( Captain Miller ) ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిలింలో నటించడం సందీప్‌కి అసలు ఇష్టం లేదు.

కానీ ఆ సమయంలో ఆయనకు డబ్బులు అవసరమై ఈ మూవీలో కెప్టెన్ రఫిక్‌గా యాక్ట్ చేశాడు.ఈ సినిమా సూపర్‌హిట్ అయింది.

• కంగనా రనౌత్

కంగనా రనౌత్( Kangana Ranaut ) BMW కారు కొనుక్కోవడానికి ప్రభాస్‌తో ఏక్ నిరంజన్( Ek Niranjan Movie ) సినిమా చేసింది.ఇది కొంచెం షాకింగ్‌గా అనిపించినా ఆమె మాజీ ప్రియుడే ఈ విషయాన్ని వెల్లడించాడు.రాజ్ 2 మూవీ ఫేమ్ అధ్యాయన్ సుమన్, కంగనా రనౌత్‌ దాదాపు 7 ఏళ్లు డేటింగ్ చేసుకున్నారు.

బ్రేకప్ తర్వాత అతడు కంగనా ఏక్ నిరంజన్ సినిమాలో ఎందుకు నటించిందో తెలిపాడు.అతడు మాట్లాడుతూ "మా నాన్న నాకు బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

దాన్ని చూసి కంగనా చాలా అసూయపడింది.అంతేకాదు వెంటనే హైదరాబాద్‌కు వెళ్లి మూవీ ఆఫర్స్ కోసం ట్రై చేసింది.

Advertisement

"ఏక్ నిరంజన్" సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రావడంతో అందులో నటించి డబ్బు సంపాదించింది.కేవలం BMW కారు కొనుగోలు చేయడానికే ఆమె ఆ మూవీ చేసింది.

" అని చెప్పాడు.

• పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) "సర్దార్ గబ్బర్ సింగ్ (2016)"( Sardaar Gabbar Singh ) సినిమాకు కథ అందించిన సంగతి తెలిసిందే.అయితే కొన్ని కారణాలవల్ల పవన్‌ ఈ యాక్షన్ కామెడీ మూవీలో నటించడానికి ఇష్టపడలేదు.ఇందులోని హీరో క్యారెక్టర్ వేరే వారు చేస్తే బాగుంటుందని అనుకున్నాడట.

కానీ ఆరంజ్ సినిమాతో నష్టపోయిన నాగబాబుకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ మూవీలో అతను హీరోగా నటించాడు.రూ.75 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా రూ.86 కోట్లు వసూలు చేసింది.

తాజా వార్తలు