ఈ సువిశాల ప్రపంచంలో ఎన్నో నగరాలు అత్యంత కీర్తిని గడించాయి.అందుకే వాటిని చూడడానికి ఎంతోమంది పర్యాటకులు ప్రతి ఏటా వెళుతూ వుంటారు.
అంటువంటి నగరాల్లో మొదటి స్థానంలో వున్నది న్యూయార్క్ నగరం.( New York ) ఇది అత్యంత ఖరీదైన నగరంగా గుర్తింపు పొందింది.
ప్రపంచంలోని అపర కుబేరులు అనబడేవారు కూడా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివసించాలంటే ముందుగా లెక్కలు వేసుకుంటారంటే అక్కడి కాస్ట్ అఫ్ లివింగ్( Cost Of Living ) ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.అందుకే ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ నగరంగా న్యూయార్క్ నిలిచింది.

న్యూయార్క్ తర్వాత చూసుకుంటే స్విట్జర్లాండ్ లోని ‘జెనీవా’( Geneva ) నగరం అత్యంత ఖరీదైన 2వ నగరంగా నిలిచింది.పర్యాటకులకు అత్యంత ప్రియమైన పట్టణమిది.ఇక్కడ పర్యాటకులు లేదంటే ట్రిప్ మీద వెళ్లేటువంటి వ్యాపారులు ఒక్క రోజు జీవించేందుకు $700 అంటే అక్షరాలా రూ.57874 రూపాయిలు అవసరం పడతాయట.ఇక ఈ లిస్టులో 3వ స్థానంలో నిలిచింది అమెరికా రాజధాని ‘వాషింగ్టన్ డీసీ.’ ఇక్కడ ఒక రోజుకు $658 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.54401లు కావాలట.అదేవిధంగా 4వ స్థానంలో మరో స్విట్జర్లాండ్ నగరమైన ‘జ్యురిచ్’ నిలిచింది.ఈ సిటీలో ఒక రోజుకు $641 (రూ.52996)లు అవసరం పడతాయి అంటే మీరు అర్ధం చేసుకోండి.

అంతేకాకుండా అమెరికాలోని ‘శాన్ ఫ్రాన్సిస్కో’ నగరం విషయానికొస్తే ఇక్కడ ఒక్క రోజుకి గాను $609 డాలర్లు అంటే దాదాపుగా రూ.50,350లు వెచ్చించాల్సి వస్తుంది.ఇక ఇజ్రాయెల్ నగరం ‘టెల్ అవివ్’ ( Tel Aviv ) ఖరీదైన నగరాల్లో 6వ స్థానంలో నిలిచింది.అదే విధంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ‘లాస్ ఎంజిల్స్’ నగరం 7వ స్థానంలో, ఇంగ్లండ్ రాజధాని ‘లండన్’ 8వ స్థానంలో నిలిచాయి.
ఇక మధ్య ఆఫ్రికా దేశమైన అంగోలా రాజధాని నగరం ‘లువాండా’ ఈ లిస్టులో 9వ స్థానంలో చేరింది.ఇక ఆఖరిగా ఫ్రాన్స్ రాజధాని ‘ప్యారిస్’ ఈ లిస్టులోని 10వ స్థానంలో చేరింది.ఈ ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టాలంటే ప్రతి రోజూ $557 అంటే రూ.46,051 అవసరం పడతాయట.







