ప్రపంచ కప్ చరిత్ర లో టాప్-5 కీలక ఫీల్డర్లు వీళ్లే..!

క్రికెట్ మ్యాచ్ లో జట్టు విజయం సాధించాలంటే బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యం.

కొన్ని సందర్భాలలో ఫీల్డింగ్ కూడా మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసేస్తుంది.

ఫీల్డర్లు ఆపిన బౌండరీల వల్ల మ్యాచులు గెలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అయితే ప్రపంచ కప్ చరిత్రలో తమ మ్యాచ్ విజయాలలో కీలక పాత్ర పోషించిన టాప్-5 ఫీల్డర్లు ఎవరో చూద్దాం.రికీ పాంటింగ్: ప్రపంచ కప్ చరిత్రలో అత్యుత్తమ ఫీల్డర్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్( Ricky Ponting ) అగ్రస్థానంలో ఉన్నాడు.1996 నుంచి 2011 వరకు జరిగిన టోర్నీలలో ఆడిన రికీ పాంటింగ్ మొత్తం 46 మ్యాచ్ లలో పాల్గొని 28 క్యాచ్లు అందుకున్నాడు.ప్రతి మ్యాచ్లో దాదాపుగా మూడు క్యాచ్లు అందుకున్నాడు.క్యాచెస్ విషయంలో రికీ పాంటింగ్ యావరేజ్ 0.608.జో రూట్: ప్రపంచ చరిత్రలో అత్యుత్తమ ఫీల్డర్ల జాబితాలో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్( Joe Root ) రెండో స్థానంలో ఉన్నాడు.మొత్తం 17 మ్యాచులు ఆడిన జో రూట్ 20 క్యాచ్లు అందుకున్నాడు.

ఇతను కూడా ప్రతి మ్యాచ్లో దాదాపుగా మూడేసి క్యాచ్లు పట్టాడు.క్యాచెస్ యావరేజ్ 1.176.

సనత్ జయసూర్య: శ్రీలంక జట్టు మాజీ ప్లేయర్ సనత్ జయసూర్య ( Sanath Jayasuriya )ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.శ్రీలంక జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.మొత్తం 38 మ్యాచులు ఆడి అందులో 18 క్యాచ్లు అందుకున్నాడు.

Advertisement

ప్రతి మ్యాచ్లో దాదాపుగా రెండు క్యాచ్లు పట్టాడు.క్యాచెస్ యావరేజ్ 0.473.క్రిస్ గేల్: వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ ( Chris Gayle )యూనివర్సల్ బాస్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.మైదానంలోకి దిగితే సిక్సర్ల వర్షం కురిపిస్తాడు.

ఫీల్డింగ్ విషయానికి వస్తే మొత్తం 35 మ్యాచ్లలో 17 క్యాచ్లు పట్టాడు.క్యాచెస్ యావరేజ్ 0.485.

ఫాఫ్ డుప్లెసిస్: దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్( Faf Duplessis ) బౌండరీ లైన్ వద్ద క్యాచ్లు పట్టడంలో ఎక్స్ పర్ట్.మొత్తం 23 మ్యాచ్లు ఆడి 16 క్యాచ్లు పట్టాడు.అంటే ప్రతి మ్యాచ్ కు దాదాపుగా రెండు క్యాచ్లు అందుకున్నాడు.క్యాచెస్ యావరేజ్ 0.272.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు