Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే..జాగ్రత్త పడండి..!

అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో బ్రెయిన్ స్ట్రోక్( Brain Stroke ) కూడా ఒకటి.చాలామంది ఆరోగ్యపరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన స్ట్రోక్ బారిన పడతారు.

బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడులోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడం వలన వస్తుంది.ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి.

ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం వలన ఇలా జరిగే ప్రమాదం ఉంటుంది.అలాగే ఈ సమయంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

లేదా ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందనే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.కాబట్టి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే కొన్ని లక్షణాలను( Brain Stroke Symptoms ) గుర్తించి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుండి వెంటనే తప్పించుకోవచ్చు.

Advertisement

అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే స్ట్రోక్ రావడానికి ముందు మైకంలా వచ్చి కళ్ళు తిరిగి( Dizziness ) కింద పడిపోవడం జరుగుతుంది.అయితే ఇలా జరిగినప్పుడు ఇది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణమే అని గుర్తించాలి.

ఇక ఆ తర్వాత ఆకస్మిక గందరగోళం, మాట్లాడటం కూడా కష్టంగా అనిపించడం లేదా ప్రసంగాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణమే.

అయితే వర్టిగో( Vertigo ) రావడం దీని వలన కళ్ళు తిరిగినట్లు కనిపించడం కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం అని చెప్పాలి.నీరసం, బలహీనంగా మారడం లాంటిది కూడా జరుగుతుంది.ఇక కాళ్లు, చేతులు పక్షవాతం రావడం, సరిగా మాట్లాడలేకపోవడం కూడా జరుగుతుంది.

ఇక కంటిచూపు( Eye Sight ) సరిగా ఉండకపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ముఖం, చేయి లేదా కాలు ఒకవైపు ఆకస్మిక నొప్పి లేదా బలహీనత ఉంటుంది.ఒకటి లేదా రెండు కళ్ళలో కూడా ఆకస్మిక ఇబ్బంది ఎలాంటి కారణం లేకుండానే ఆకస్మిక, తీవ్రమైన తలనొప్పి ఉండడం కూడా బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణం.

మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!
Advertisement

తాజా వార్తలు