యువతలో గుండె పోటు రావడానికి గల బలమైన కారణాలు ఇవే..!

సాధారణంగా చెప్పాలంటే గుండెపోటు( heart attack ) అనేది ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే వస్తూ ఉండేది.

కానీ ప్రస్తుత సమాజంలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి కూడా గుండెపోటు రావడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.

అయితే ప్రస్తుత సమాజంలో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులలో గుండెపోటుతో బాధపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.మారిన జీవనశైలి, శరీరక శ్రమ లేకపోవడం, నిద్ర లేకపోవడం వంటి చెడు అలవాట్ల వల్ల గుండె పై చెడు ప్రభావం పడుతుంది.

యువతలో అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్( High blood pressure, diabetes, high cholesterol ) స్థాయిలు పెరుగుతున్నాయి.

ముఖ్యంగా చెప్పాలంటే ధూమపానం, పొగాకు వాడకం, మాదక ద్రవ్యాల వినియోగం మొదలైన చెడు అలవాట్ల వల్ల గుండె సమస్యలు పెరిగిపోతున్నాయి.వీటిని దూరంగా ఉంచడానికి సమతుల్య జీవన శైలి అనుసరించడం ఎంతో ముఖ్యం.ముఖ్యంగా యువతలో గుండె పోటు రావడానికి గల బలమైన చెడు కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రక్తంలో అధిక చక్కెర స్థాయిలు రక్తనాళాలను దెబ్బతీస్తాయి.ఇది ధమనులలో కొవ్వు పెరుగుదలకు దారితీస్తుంది.

ఇది రక్త సరఫరాను అడ్డుకుంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే గుండె కండరాలను చిక్కగా చేసి గుండె పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

దీని వల్ల గుండె పోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.అలాగే అధిక బరువు, ఉబకాయం, గుండెకు హాని చేయడం కూడా చేస్తున్నాయి.మద్యం తాగడం, క్రమ రహిత నిద్ర కారణంగా యువతలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది.

ఇలాంటివారు బరువు తగ్గించుకొని గుండెను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం.ఇంకా చెప్పాలంటే మద్యం సేవించడం వంటి అలవాట్లు గుండె ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

అలాగే గుండెతో పాటు శరీరంలోని ఇతర అవయవాలపై కూడా చెడు ప్రభావం ఉంటుంది.కాబట్టి యువత ఈ చెడు అలవాట్లను దూరం చేసుకోవడం ఎంతో మంచిది.

Advertisement

సాధ్యమైనంత వరకు ఈ అలవాట్లకు దూరంగా ఉంటే గుండెను రక్షించుకోవచ్చు.

తాజా వార్తలు