బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం నాలుగు వారాలను పూర్తి చేసుకొని హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు.ఈ క్రమంలోనే నాలుగో వారంలో భాగంగా హౌస్ నుంచి టేస్టీ తేజ(Tasty Teja) బయటకు వెళ్తారని అందరూ భావించారు సోషల్ మీడియాలో కూడా ఇదే వార్తలు వచ్చాయి.
కానీ చివరి నిమిషంలో మాత్రం టేస్టీ తేజ కాకుండా రతిక (Rathika) హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు.రతిక ఎలిమినేట్ అంటూ నాగార్జున(Nagarjuna ) చెప్పడంతో ఒక్కసారిగా రతిక కూడా ఆశ్చర్యపోయారు తాను ఎలిమినేట్ కావడం ఏంటి అంటూ ఆశ్చర్యంలో కూడా ఈమె ఎమోషనల్ అయ్యారు.
అయితే ఇంకొన్ని వారాలపాటు హౌస్ లో ఉండాల్సిన ఈమె ఇలా నాలుగవ వారంలోనే హౌస్ నుంచి బయటకు రావడానికి కారణం లేకపోలేదు.

బిగ్ బాస్ హౌస్ లో రతిక వ్యవహరించిన తీరు అందరికీ చిరాకు పుట్టించింది.కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాకుండా బిగ్ బాస్ అలాగే నాగార్జునకు కూడా ఈమె ఆటతీరు మాట మార్చే విధానం తన స్వార్థం కోసం అందరిని వాడుకోవడం ఏమాత్రం ప్రేక్షకులకు నచ్చలేదు దీంతో ఓట్ల రూపంలో రతికకు బాగా బుద్ధి చెప్పి తనని హౌస్ నుంచి బయటకు పంపించారని తెలుస్తుంది.హౌస్ లోకి వచ్చినటువంటి మొదట్లో ఈమె ప్రశాంత్ తో( Pallavi Prasanth ) చాలా చనువుగా ఉంది అయితే ప్రశాంత్ ని వదిలేసి యావర్ వెంటపడింది.
ఇక ప్రశాంత్ ను చాలా చీప్ గా మాట్లాడింది.

మొదటినుంచి శివాజీ( Sivaji ) బ్యాచ్ తో ఉన్నటువంటి ఈమె చివరికి వారికి హ్యాండ్ ఇచ్చి సీరియల్ బ్యాచ్ తో కలిసి పోయారు.ఇక బిగ్ బాస్ నిర్వహించే టాస్కులలో ఏ టాస్క్ లో కూడా ఈమె వంద శాతం ఫోకస్ పెట్టి ఆడలేదు.నేను ఇలాగే చేస్తాను, ఇలాగే ఉంటాను అంటూ ఎదురు మాట్లాడటంతో ఈమె అతి ఓవర్ యాక్షన్ ఎవరు కూడా అంగీకరించలేకపోయారు.
దీంతో తనని నాలుగవ వారమే హౌస్ నుంచి బయటకు పంపించారు.ఇక ఈమె ఎలిమినేషన్ అని చెప్పి తనని సీక్రెట్ రూమ్ కి పంపిస్తారని అందరూ భావించినప్పటికీ అలా కాకుండా నేరుగా తనని ఇంటికి పంపించారని తెలుస్తుంది.
ఇక బిగ్ బాస్ వేదిక పైకి వచ్చిన తర్వాత నాగార్జున కూడా ఈ జర్నీ నీకు ఒక మంచి గుణపాఠం కావాలి అంటూ చెప్పారంటే ఈమె ఆట తీరుతో ఎలా విసుగు చెందారో అర్థమవుతుంది.







