తాజాగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ సెంచరీ( Travis Head ) చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా తన పేరును లిఖించుకున్నాడు.
అన్ని ఫార్మాట్లా ఫైనల్ మ్యాచ్లలో సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం.వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తొలి సెంచరీ 1975లో నమోదు అయ్యింది.
వెస్టిండీస్ ప్లేయర్ క్లైవ్ లాయిడ్( Clive Lloyd ) వన్డే వరల్డ్ కప్ లో సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.

1998లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ ప్లేయర్ ఫిలో వాలెస్ ( Philo Wallace )సెంచరీ చేసి, ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా తన పేరుపై రికార్డ్ నమోదు చేసుకున్నాడు.ఇక టీ 20 ఫార్మాట్లో.ఐసీసీ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో ఇంతవరకు సెంచరీ నమోదు కాలేదు.
కానీ టీ 20 వరల్డ్ కప్ లో వివిధ దశల్లో 11 సెంచరీలు నమోదు అయ్యాయి.

ఇక ఐసీసీ టోర్నీ ఫైనల్ లో సెంచరీ నమోదు కావటానికి దాదాపుగా 25 సంవత్సరాలు పట్టింది.లండన్ లోని ఓవల్ వేదికగా నిన్న మొదలైన డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ లో తొలి సెంచరీ నమోదు అయింది.తాజాగా జరుగుతున్న డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆరంభంలో కాస్త ఇబ్బంది పడిన ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉంది.
ఆస్ట్రేలియా బ్యాటర్లైన ఉస్మాన్ ఖ్వాజా 0, మార్నస్ లబూషేన్ 26, డేవిడ్ వార్నర్ 43 పరుగులతో పెవిలియన్ చేరారు.ట్రావిస్ హెడ్ 163, స్టీవ్ స్మిత్ 110 పరుగులతో సత్తా చాటారు.
ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్ (163) ను అవుట్ చేశాడు.భారత్ తొందరగా వికెట్లు తీయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.







