సినిమా ప్రపంచం అంటే సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు సినిమా అంటే కొత్త లోకంగా భావిస్తారు.
ఇక సినిమాలు చూడటానికి చాలామంది అభిమాన నటుల సినిమాలయితేనే ఇష్టపడతారు.కానీ కొందరు ప్రేక్షకులు మాత్రం మంచి కంటెంట్ ఉంటే సినిమా చూడడానికి ఇష్టపడతారు.
ఇక మరి కొంతమంది ప్రతి వారం వచ్చిన సినిమాలను చూడటానికి ఇష్టపడతారు.నిజానికి అది వారికి ఒక వ్యసనం అని చెప్పవచ్చు.
అలా వచ్చేవారం ఏ సినిమా విడుదలవుతుందో అని ముందుగానే సర్చ్ లు చేసి వారం ముందే హడావుడిగా కనిపిస్తూ ఉంటారు.ముందుగానే టికెట్లు బుక్ చేసి సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఇక అలాంటి వారి కోసం తీపి కబురు అని చెప్పవచ్చు.అదేంటంటే వచ్చేవారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
థియేటర్ లతో పాటు ఓటీటీలో కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఇంతకు ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

హరి, హరిష్ దర్శకత్వంలో వస్తున్న యశోద సినిమా గురించి అందరికీ తెలిసిందే.సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ సమంత నటించింది.అయితే ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.ఇక ఈ సినిమాను థియేటర్లో నవంబర్ 11న విడుదల చేయనున్నారు.
ఉదయ్ శంకర్ హీరోగా నటించిన నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకు గురు పవన్ దర్శకత్వం వహించగా.ఈ సినిమా సస్పెన్స్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ముందుకు రానుంది.
అయితే ఈ సినిమా కూడా 11న రానుంది.శ్రీరామ్ నిమ్మల నటించిన మది సినిమా కూడా ఈనెల 11న థియేటర్లో విడుదల కానుంది.
ఇక అమితాబ్ బచ్చన్ నటించిన ఊంచాయి సినిమా కూడా ఈనెల 11న థియేటర్లో విడుదల కానుంది.

ఇక ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్రీత్ ఇన్ టు ది షాడోస్ అనే సిరీస్ నవంబర్ 9న, ఇరావిన్ నిగళ్ అనే తమిళ మూవీ నవంబర్ 11, సిక్సర్ అనే హిందీ సిరీస్ నవంబర్ 11న విడుదల కానుంది.నెట్ ఫ్లిక్స్ లో బిహైండ్ ఎవరీ స్టార్ అనే కొరియన్ సిరీస్, ద క్లాజ్ ఫ్యామిలీ టు అనే డచ్ సిరీస్, ట్రివియా వర్స్ అనే హాలీవుడ్ సిరీస్ లు నవంబర్ 8న స్ట్రీమింగ్ కానున్నాయి.

ద క్రౌన్ అనే వెబ్ సిరీస్ నవంబర్ 9 న స్ట్రీమింగ్ కానుంది.ఇక ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ అనే హాలీవుడ్ మూవీ, లాస్ట్ బుల్లెట్ అనే ఫ్రెంచ్ మూవీ, వారియర్ నన్ అనే వెబ్ సిరీస్ లు నవంబర్ 10 న విడుదల కానున్నాయి.మోనికా ఓ మై డార్లింగ్ అనే హిందీ సిరీస్, ఏన్సెంట్ ఆపోకలిప్స్ అని సిరీస్, థాయ్ మసాజ్ అనే హిందీ సిరీస్ నవంబర్ 11న స్ట్రీమింగ్ కానుంది.
జి ఫైవ్ లో ముఖ్ బీర్ అనే సిరీస్, సొనీ లివ్ లో తనావ్ అనే హిందీ సిరీస్, లయన్స్ గేట్ ప్లేలో హాట్ సీట్ అనే హాలీవుడ్ సిరీస్ నవంబర్ 11న స్ట్రీమింగ్ కానుంది.
ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సేవ్ ఔర్ స్క్వాడ్ అని ఒరిజినల్ సిరీస్ నవంబర్ 9న, మనీ మాఫియా అనే హిందీ సీరియల్స్ నవంబర్ 10 న, రోషాక్ అని తెలుగు సిరీస్ నవంబర్ 11న స్ట్రీమింగ్ కానుంది.







