వివాహమైన మహిళలు మంగళసూత్రం విషయంలో చేసే తప్పులు ఇవే..!

వివాహమైన మహిళకు మెడలో తాళి అందం అని పెద్దవారు చెబుతూ ఉంటారు.కానీ ప్రస్తుత రోజులలో ఫ్యాషన్ పేరుతో తాళిని తీసి పక్కన పెట్టేస్తున్నారు.

ఈ ఫ్యాషన్ పేరుతో ఆ తాళి అనే పదానికి అర్థం లేకుండా పోయింది.మంగళసూత్రం అనేది భార్యాభర్తల మధ్య శాశ్వత బంధానికి గుర్తు.

మంగళసూత్రం వైవాహిక జీవితంలో ఉండే సమస్త కీడును తొలగిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.శక్తి స్వరూపిణి అయిన మహిళ మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు భర్త ఆరోగ్యంగా ఉంటాడని పెద్దవారు చెబుతూ ఉంటారు.

అయితే ప్రస్తుత రోజులలో మంగళసూత్రం వేసుకునే మహిళలు ( Women )వారికి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు.మరి మహిళలు చేస్తున్న ఆ పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మహిళలు ధరించే మంగళసూత్రం( Mangala sutra ) ఎప్పుడు కూడా హృదయాన్ని తాకుతూ వక్షస్థలం కింద వరకు ఉండాలి.సౌభాగ్యానికి ప్రతికాలైన పసుపు, కుంకుమలను నిత్యం సూత్రానికి పెట్టుకోవాలి.చాలా మంది మంగళ సూత్రాలలో పగడాలు, ముత్యాలు, అమ్మవారి రూపు పెట్టుకుంటూ ఉంటారు.

అయితే ఇలా అసలు చేయకూడదు.అలాగే స్త్రీలు ధరించే మంగళసూత్రానికి ఇరువైపులా ఎరుపు, నలుపు పూసలు తప్పకుండా ఉండాలి.

మంగళసూత్రాలకు చాలామంది పిన్నిసులు పెడుతూ ఉంటారు.మంగళ సూత్రాలకు ఇనుము వస్తువులను తాకకుండా చూసుకోవాలి.

ఎందుకంటే ఇనుము నెగిటివ్ ఎనర్జీని( Negative energy ) గ్రహిస్తుంది.దీంతో బంధం మధ్య అన్యోన్యత లోపిస్తుందని పండితులు చెబుతున్నారు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
శ్రావణ భార్గవి - హేమచంద్ర లవ్ స్టోరీ గురించి తెలుసా.. ఆ సినిమా టైం లోనే?

కాబట్టి మహిళలు పొరపాటున కూడా మంగళసూత్రానికి పిన్నిసులు తగిలించడం లాంటివి అస్సలు చేయకూడదు.

Advertisement

ఇంకా చెప్పాలంటే కుజుడు, చంద్రుడికి ప్రతికలైనా ఈ రెండు రాళ్లు గృహ దోషాలను తొలగించి వైవాహిక బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి.సాధారణంగా మహిళలకు కుజ దోషం, కుజ గ్రహ ప్రభావం వల్ల అతి కోపం, కలహాలు, మొండితనం అనారోగ్య సమస్యలు ( Health problems )ఏర్పడతాయి.పగడం, ముత్యం, ధరించడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఏ ఇంట్లో అయినా మహిళ ప్రశాంతంగా ఉంటే అంతకుమించిన ఆనందం ఉండదని పెద్దవారు చెబుతూ ఉంటారు.అదే విధంగా మహిళలు ఎప్పుడూ కూడా మంగళసూత్రాన్ని తన భర్తకు తప్ప ఇతరులకు కనిపించేలా ధరించకూడదు.

తాజా వార్తలు