భారత్‌ సహా వివిధ దేశాలనుండి బ్రిటన్‌ దోచుకెళ్లన వస్తువులు ఇవే.. విలువ ఎంతంటే?

బ్రిటన్‌( Britain ) దేశ సంపాదకన్నా, అది ఇతర దేశాలనుండి దోచుకెళ్లిన సంపదే విలువైనది.అక్కా ఎత్తుకెళ్లిన వస్తువుల సంపదకు లెక్కేలేదు.

ఆ జాబితాలో కోహినూర్‌ వజ్రం, షాజహాన్‌ వైన్‌ జార్‌, టిప్పుసుల్తాన్‌ ఉంగరం, ప్రాచీన ఈజిప్ట్‌కు చెందిన విలువైన రోసెట్టా స్టోన్‌, బ్రెజిల్‌( Rosetta Stone, Brazil ) నుంచి 70 వేల రబ్బరు విత్తనాల చోరీ వంటివి ఎన్నో వస్తువులు దోచుకొని పోయారు.అంతేకాకుండా విక్టోరియా మ్యూజియంలో భద్రంగా ఉన్న విలువైన సాంస్కృతిక, వారసత్వ కళాఖండాలు వారి దొంగతనానికి నిలువెత్తు నిదర్శనాలు.

అలా బ్రిటన్‌లోని పలు మ్యూజియాలలో ప్రస్తుతం ప్రదర్శనలో ఉన్న అనేక సాంస్కృతిక కళాఖండాలు వలస రాజ్యాల ప్రజల నుంచి దోచుకున్నవే.

ఈ క్రమంలో వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆయా దేశాలు కోరుతున్నా, బ్రిటన్‌ ఆగోడుని పట్టించుకోవడం లేదు.అందులో టిప్పు సుల్తాన్ ఉంగరంపై( Tipu Sultans ring ) దేవనాగరి లిపిలో రాముడి పేరు చెక్కి ఉండేది.ఖడ్గాన్ని భారతదేశానికి తిరిగి రప్పించారు గాని 41 గ్రాముల ఈ ఉంగరాన్ని రప్పించలేకపోయారు.ఇక ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్‌ వజ్రాన్ని భారతదేశం నుంచి బ్రిటిషర్లు తీసుకుపోయారు.105.6 క్యారెట్లు, 21.6 గ్రాముల బరువున్న కోహినూర్‌ వజ్రాన్ని( Kohinoor diamond ) ప్రస్తుత ఏపీలోని కొల్లూరు గనిలో సేకరించారు.మొఘల్‌ చక్రవర్తులు( Mughal emperors ) నెమలి సింహాసనంపై దీన్ని ఉంచేవారు.

Advertisement

ప్రస్తుతం ఇది లండన్‌ టవర్‌కి చెందిన జ్యువెల్‌ హౌస్‌ మ్యూజియంలో ఉంది.

ఎల్గిన్‌ మార్బుల్స్‌( Elgin Marbles ) పురాతన గ్రీకు శిల్పాల సమాహారం.మధ్య బ్రిటిషర్లు ఎథీనా దేవతకు అంకితం చేసిన ఈ శిల్పాలను తీసుకెళ్లారు.ఈ శిల్పాలు గ్రీకుల గొప్పతనం, వారి వారసత్వం, చరిత్రను తెలుపుతాయి.

ఇక బ్రెజిల్‌కే సొంతమైన హెవియా బ్రాసిలియెన్సిస్‌ ( Hevea brasiliensis )(రబ్బరు చెట్టు) 70 వేల విత్తనాలను 1876లో బ్రిటిష్‌ యాత్రికుడు హెన్రీ విక్హామ్‌ దొంగిలించాడు.ఇది చరిత్ర గతిని మార్చిన ఘటనగా పేర్కొంటారు.

ఈజిప్టులోని రోసెట్టా ప్రాంతంలో దొరికిన పురాతన శాసనం రోసెట్టా స్టోన్‌. నెపోలియన్‌ బోనపార్టీ ఈజిప్టు నుంచి దీన్ని స్వాదీనం చేసుకోగా 1800 సంవత్సరంలో ఫ్రెంచ్‌ సైన్యం ఓడిపోయిన తర్వాత బ్రిటిషర్లు దీన్ని స్వాదీనం చేసుకుని బ్రిటన్‌కు తరలించారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఇంకా ఇలాంటి విలువైన వస్తువులు ఎన్నో బ్రిటిష్ వారు అప్పనంగా దోచుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు