తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్.( Ram Charan ) చాలా తక్కువ సమయంలోనే వరుస విజయాలను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే ఆయనతో సినిమా చేసిన చాలా మంది దర్శకులు స్టార్ డైరెక్టర్స్ గా గుర్తింపు పొందితే మరి కొంతమంది మాత్రం ప్లాప్ డైరెక్టర్స్ గా గుర్తింపు పొందారు.ఇక అలాంటివారిలో మొదటగా ఆరెంజ్ సినిమాతో( Orange Movie ) భారీ డిజాస్టర్ ని అందుకున్న బొమ్మరిల్లు భాస్కర్ మొదటి స్థానంలో ఉండగా, ఆయన తర్వాత రామ్ చరణ్ తో తుఫాన్ సినిమా( Toofan Movie ) తీసి భారీ ప్లాప్ ను చేసి మూటగట్టుకున్న అపూర్వ లఖియా( Apoorva Lakhia ) ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు.
ఆ సినిమా చేసి భారీ ప్లాప్ ను మూటగట్టుకోవడమే కాకుండా వాళ్లకి ఇంకో సినిమా చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది.ఇటు బొమ్మరిల్లు భాస్కర్ అయితే ఇప్పటికీ ప్లపుల్లోనే కొనసాగుతున్నాడు.అలా రామ్ చరణ్ తో సినిమాలు చేసిన వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో చాలా దెబ్బతిన్నారనే చెప్పాలి.ఇక బొమ్మరిల్లు భాస్కర్( Bommarillu Bhaskar ) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేసినప్పటికీ అది పెద్దగా సక్సెస్ సాధించలేదు.
ఇక ఆయన ఇప్పుడు మరో సినిమా కూడా చేయడం లేదు.
ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ఇచ్చిన జలుక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ఇండస్ట్రీలో అంతకుముందు వచ్చిన క్రేజ్ మొత్తాన్ని పోగొట్టుకొని ప్రస్తుతానికి సినిమా ఇచ్చే హీరో కోసం తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఎప్పుడు కనక మరొక సక్సెస్ కొట్టి తనను తాను ప్రూవ్ చేసుకుంటే తప్ప ఏ హీరో కూడా బొమ్మరిల్లు భాస్కర్ కి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ అయితే లేదు…ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్( Game Changer Movie ) అనే సినిమా చేస్తున్నాడు…
.